టాటా మోటార్స్ నుంచి తాజాగా గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్ట్ లో హారియర్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్స్ 5-స్టార్ రేటింగ్ లభించింది. ప్రస్తుతం ఈ రెండు ఎస్‍యూవీలు ఇండియాలో బాగా అమ్ముడవుతున్న సేఫ్ కార్ల లిస్టులో టాప్ లో నిలిచాయి. అయితే ఇప్పుడు మనం ప్రస్తుతం అందుబాటులో సేఫ్ కార్లను ఒకసారి పరిశీలిద్దాం.
టాటా హారియర్ /సఫారి ఫేస్‌లిఫ్ట్స్
టాటా హారియర్ మరియు సఫారి ఫేస్‍లిఫ్ట్స్ అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు 33.05 మరియు 49 పాయింట్లకు గాను 45 పాయింట్లు స్కోర్ చేయడంతో, దాని ఫలితంగా 5-స్టార్ రేటింగ్ లభించింది. గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో ఇప్పటి వరకు ఇదే అత్యధిక స్కోరు అని చెప్పవచ్చు. ఈ రెండింటి బాడీ షెల్స్ మున్ముందు ఎటువంటి లోడింగ్ ని అయినా తట్టుకునేలా తయారుచేయబడ్డాయి.
సేఫ్టీ పరంగా చూస్తే, టాటా నుంచి ఈ రెండు ఎస్‍యూవీలలో 6 ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, టిపిఎంఎస్, ఈఎస్పీ, హిల్ హోల్డ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, రోల్-ఓవర్ మిటిగేషన్ సిస్టం, రియర్ పార్కింగ్ సెన్సార్స్, స్పీడ్ అలెర్ట్ సిస్టం, మరియు స్టాండర్డ్ గా రిమైండర్ సిస్టం ఉన్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్/ స్కోడా స్లావియా
ఫోక్స్‌వ్యాగన్ వర్టూస్ మరియు స్కోడా స్లావియాలను వాటి బ్రాండ్స్ ఆధారంగా కొత్త ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్ ఫాంపై తయారుచేయగా, ఈ రెండింటికి అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ విభాగాల్లో 5-స్టార్ రేటింగ్ లభించింది. అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో వరుసగా 34 పాయింట్లకు 29.71 మరియు 47 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేశాయి. అదే విధంగా, ఈ రెండు కార్ల బాడీ షెల్స్ స్టెబిలిటీని మెయింటెయిన్ చేస్తూ అధిక లోడింగ్ కూడా తట్టుకునేలా తయారు చేయబడ్డాయి.
ముందుగా సేఫ్టీ అంశాల గురించి చెప్పాలంటే, ఈ రెండు సెడాన్స్ లో 6-ఎయిర్ బ్యాగ్స్, ఈఎస్‍సీ, ఈబీడీతో కూడిన ఏబీఎస్, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, మరియు లోడ్ లిమిటర్స్ వంటి స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
స్కోడా కుషాక్/ ఫోక్స్‌వ్యాగన్ టైగున్
ఇంతకు ముందు చెప్పుకున్న విధంగా అదే ఎంక్యూబీ-ఏఓ-ఐఎన్ ప్లాట్ ఫాంపై తయారైన మోడల్స్ గా స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ నిలిచి, 5-స్టార్ రేటింగ్ ని స్కోర్ చేశాయి. అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరంగా ఈ రెండు ఎస్‍యూవీలు వరుసగా 34 పాయింట్లకు 29.64 మరియు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేశాయి.
స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ ఒత్తిడిని మరియు పెద్ద లోడింగ్ ను సైతం తట్టుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు కార్లలో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం, మరియు లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్ లాంటి బెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి.
హ్యుందాయ్ వెర్నా
గ్లోబల్ ఎన్ క్యాప్ క్రాష్ టెస్టులో హ్యుందాయ్ వెర్నా నుంచి వచ్చిన న్యూ-జెన్ వెర్నాకు 5-స్టార్ రేటింగ్ లభించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ సెడాన్ అడల్ట్ ఆక్యుపెంట్ మరియు చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ పరంగా వరుసగా 34 పాయింట్లకు 28.18 పాయింట్లు మరియు 49 పాయింట్లకు గాను 42 పాయింట్లు స్కోర్ చేసింది.
వెర్నాలో 6-ఎయిర్ బ్యాగ్స్, ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‍సీ, రియర్ పార్కింగ్ సెన్సార్స్, లోడ్ లిమిటర్స్ తో సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్స్, మరియు సీట్ బెల్ట్ రిమైండర్ సిస్టం వంటి అద్బుతమైన సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి. మిగతా మోడల్స్ తో పోల్చితే ఈ కార్ యొక్క బాడీ షెల్ స్థిరంగా ఉండకపోవచ్చు, అదే విధంగా దీని చాసిస్ కు ఎక్కువ లోడింగ్ ని తట్టుకునేంత కెపాసిటీ లేదు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్