- 28.06కిమీ/కేజీ క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తున్న కొత్త మోడల్
- ఎఎంటితో టియాగో సిఎన్జి వెర్షన్లో కూడా లభ్యం
టాటా మోటార్స్ టిగోర్ సిఎన్జి ఎఎంటిని రూ. 8.85 లక్షలు (ఎక్స్-షోరూమ్)ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఇది XZA మరియు XZA+ అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్తో 72bhp మరియు 95Nm మాక్సిమం టార్క్ను ఉత్పత్తి చేయగా, ట్రాన్స్మిషన్ విధులు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడి 28.06 కిమీ/కేజీక్లెయిమ్డ్ మైలేజ్ ని అందిస్తుంది.
ఇది కాకుండా, టిగోర్ ఇప్పుడు న్యూ మిటియోర్ బ్రాంజ్ ఎక్ట్సీరియర్ కలర్లో కూడా అందుబాటులో ఉంది. దీనితో, టాటా యొక్క సిఎన్జి ప్రొఫైల్లో ఇప్పుడు టియాగో మరియు టిగోర్ సిఎన్జి, ఆల్ట్రోజ్ సిఎన్జి, పంచ్ సిఎన్జి కూడా ఉన్నాయి. అదనంగా, దీని ఆటోమేకర్ గత 24 నెలల్లో 1.3 లక్షలకు పైగా సిఎన్జి కార్లను విక్రయించింది.
వేరియంట్ వారీగా టిగోర్ సిఎన్జి ఎఎంటి వేరియంట్స్ యొక్క (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్స్ | ధరలు |
XZA | రూ. 8.85 లక్షలు |
XZA+ | రూ. 9.55 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప