- నిస్సాన్ మాగ్నైట్ నుంచి స్పెషల్ ఎడిషన్ గా రానున్న కురో
- స్టాండర్డ్ మోడల్ కంటే బెటర్ గా అదనపు ఫీచర్స్
ఇండియా అంతటా నిస్సాన్ మాగ్నైట్ స్పెషల్ ఎడిషన్ గా చెప్పుకుంటున్న మోడల్ లాంచ్ డేట్ ఎప్పుడో నిస్సాన్ కంపెనీ ప్రకటించింది. ఆ మోడల్ ఏంటో తెలుసా ? అదే కురో ఎడిషన్, ఇది వచ్చే నెలలో లాంచ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు మనం రెగ్యులర్ వెర్షన్స్ కు భిన్నంగా ఇందులో ఏమేం ఉండనున్నాయో తెలుసుకుందాం.
ఎక్స్టీరియర్ పరంగా కాస్మోటిక్ మార్పులు
మాగ్నైట్ కురో ఎడిషన్ లో స్పోర్ట్స్ మోడ్ లాగా, ఇంతకు ముందున్నఒకే తరహా స్పెషల్ ఎడిషన్స్ లా అంతటా బ్లాక్ ఎక్స్టీరియర్ ఉండనుంది. కార్ కంపెనీ ఈ స్పెషల్ వేరియంట్ లో బయటి వైపు గ్రిల్ ను బ్లాక్ కలర్ తో, స్కిడ్ ప్లేట్, రూఫ్ రెయిల్స్ తో అందించనుంది. హెడ్ ల్యాంప్స్ కూడా బ్లాక్ ఫినిష్ తో రానున్నాయి. ఇంకా చెప్పాలంటే, క్రాస్ ఓవర్ రైడ్ బ్లాక్ అల్లాయ్స్ తో డిస్టింక్ట్ బ్యాడ్జిని కలిగి ఉంది.
క్యాబిన్ లో అదనపు ఫీచర్స్
మాగ్నైట్ కురో ఎడిషన్ లోపలి భాగంలో చూస్తే, కార్ అంతటా గ్లోస్ బ్లాక్ ఇంస్ట్రుమెంట్ ప్యానెల్ తో ఉండి, బ్లాక్ ఇంటీరియర్ డిజైన్ ని కలిగి ఉంది. అలాగే రూఫ్ కలర్డ్ డోర్ ట్రిమ్ తో అమర్చబడి ఉంది. ఇంకా 360-డిగ్రీ కెమెరా, సెంటర్ కన్సోల్ ఆర్మ్ రెస్ట్, వైడర్ ఐఆర్ విఎం, వైర్ లెస్ చార్జర్ మరియు థీమ్డ్ ఫ్లోర్ మ్యాట్స్ వంటి అదనపు ఫీచర్స్ ఇందులో ఉన్నాయి.
లాంచ్, టైం లైన్, బుకింగ్స్ మరియు వేరియంట్స్
నిస్సాన్ ఇండియా కురో ఎడిషన్ ను అక్టోబరులో ఆవిష్కరిస్తారని మాత్రం ప్రకటించినప్పటికీ, ధరలలో ఉన్న తేడాలను ఇప్పటివరకు పేర్కొనలేదు. కానీ ప్రస్తుతానికి కేవలం రూ.11వేల టోకెన్ అమౌంట్ తో అధికారిక డీలర్స్ వద్ద బుక్ చేసుకోవచ్చని నిస్సాన్ కంపెనీ తెలిపింది. టాప్ స్పెసిఫికేషన్స్ అన్నీ మాగ్నైట్ ఎక్స్వి ఎంటి, టర్బో ఎక్స్వి మరియు టర్బో వేరియంట్స్ లో ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్