- 475కి.మీ వరకు డబ్ల్యూఎల్‍టిపి -క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తున్న XC40 రీఛార్జ్ సింగిల్
- ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా బుకింగ్ ప్రారంభం
వోల్వో కార్ ఇండియా XC40 రీఛార్జ్ యొక్క సింగిల్-మోటార్ వేరియంట్‌ను ఇండియాలో రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. ఆసక్తి ఉన్న కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యువిని ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా ప్రత్యేకంగా బుక్ చేసుకోవచ్చు.
XC40రీఛార్జ్ సింగిల్ 69kWh బ్యాటరీ ప్యాక్ తో రాగా, ఇది 236bhp మరియు 420Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి మోటారుకు ఫీడ్ చేస్తుంది. బిఎండబ్ల్యూ iX1-కి పోటీగా ఉన్న ఈ మోడల్ డబ్ల్యూఎల్‍టిపి -క్లెయిమ్ చేసిన 475కి.మీ రేంజ్ ని అందిస్తుంది మరియు కేవలం 7.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ నుండి 180కెఎంపిహెచ్ వరకు మాక్సిమం వేగాన్ని అందుకోగలదు.
అదనంగా ఇందులో, ఆటోమేకర్ 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ, 3 సంవత్సరాల కాంప్రహెన్సివ్ కారు వారంటీ, 3 సంవత్సరాల సర్వీస్ ప్యాకేజీ, 3 సంవత్సరాల రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు డిజిటల్ సర్వీస్ కు 5 సంవత్సరాలు సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తుంది.
ఈ విజయంపై , వోల్వో కార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ జ్యోతి మల్హోత్రా మాట్లాడుతూ, “2022 సంవత్సరంలో లాంచ్ అయిన XC40 రీఛార్జ్ భారీ విజయం సాధించిన తర్వాత, మేము దాని సింగిల్-మోటార్ వేరియంట్‌ను ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది.మా కస్టమర్ బేస్‌ను పెంచడానికి అలాగే ఇండియన్ ఈవీ మార్కెట్‌ను పెంచడంలో మా నిబద్ధతను ప్రదర్శించడానికి ఈ వెహికల్ ధర నిర్ణయించబడింది.ఈ ప్రయోగం ఇండియన్ కస్టమర్లకు అసాధారణమైన పెర్ఫార్మెన్స్, సస్టైనబిలిటీ మరియు సౌలభ్యం యొక్క అసాధారణ కలయికను అందించడానికి మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి మరియు ఇండియాలో ఏటా ఒక కొత్త ఎలక్ట్రిక్ మోడల్‌ను పరిచయం చేస్తామన్న మా వాగ్దానాన్ని బలపరుస్తుంది. మా అన్ని మోడల్స్ మాదిరిగానే, XC40 రీఛార్జ్ కూడా బెంగళూరులోని మా హోస్కోటే ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడింది” అని తెలియజేసారు.
అనువాదించిన వారు: రాజపుష్ప