- ఈ బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ పోర్టల్ ద్వారారూ. 1 లక్షతో ప్రత్యేకంగా బుకింగ్స్ ప్రారంభం
- ఇప్పుడు రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉన్న XC40 రీఛార్జ్
వోల్వో కార్ ఇండియా గత నెలలో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ ఎస్‌యువి కొత్త వేరియంట్XC40 రీఛార్జ్ సింగిల్ వేరియంట్ బుకింగ్‌లను ప్రారంభించింది. దీనిని రూ. 54.95 లక్షలు (ఎక్స్-షోరూమ్)ధరతో పొందవచ్చు. అలాగే, మార్చి 19వ తేదీ నుండి దీని బుకింగ్స్ ప్రారంభంకాగా, రూ. 1 లక్ష తో దీనిని ఈ బ్రాండ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా బుక్ చేసుకునే సౌకర్యం ఉంది.
XC40 రీఛార్జ్ అనేది వోల్వో నుండి కర్ణాటకలోని బెంగళూరులోని హోస్కోటేలోని కంపెనీ ప్లాంట్‌లో అసెంబుల్ చేయబడిన మూడవ ఎలక్ట్రిక్ కారు. ఇక సింగిల్ వేరియంట్ విషయానికొస్తే, ఈ వెర్షన్, పేరు సూచించినట్లుగా, ఇప్పుడు టాప్-స్పెక్ వెర్షన్‌లోని ట్విన్ మోటర్ సెటప్‌కు విరుద్ధంగా ఒకే ఎలక్ట్రిక్ మోటారును పొందింది.
XC40 రీఛార్జ్ సింగిల్‌లోని 69kWh బ్యాటరీ ప్యాక్ తో వెనుక వీల్స్ కి పవర్ ని సప్లై చేసే ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడింది. ఇది 238bhp మరియు 420Nm టార్క్ పవర్ అవుట్‌పుట్ ని అందిస్తుంది. మరో విశేషం ఏంటి అంటే, ఈ కారు 7.3 సెకన్లలో 0-100కెఎంపిహెచ్ వేగాన్ని అందుకుంటుంది. అలాగే ఈ మోడల్, ఒక పూర్తి ఛార్జింగ్‌తో 475కిమీ డబ్ల్యూఎల్‍టిపి -క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, కొత్త వోల్వో XC40 రీఛార్జ్ సింగిల్ వేరియంట్‌లో లెదర్-ఫ్రీ ఇంటీరియర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎయిర్ ప్యూరిఫైయర్, రివర్స్ కెమెరా, బ్లైండ్ స్పాట్ మానిటర్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఏడీఏఎస్(ఎడాస్) సూట్, ఏడు ఎయిర్‌బ్యాగ్స్ మరియు వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప