- కేవలం GX ప్లస్ వేరియంట్ పై పెరిగిన ధర
- రూ.19.99 లక్షలతో ఎక్స్-షోరూం ధరలు ప్రారంభం
ఇన్నోవా క్రిస్టా ఎంపివిపై ధరలను పెంచుతున్నట్లు టయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ప్రకటించగా, పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి. అయితే, ఈ మోడల్ లోని సెలెక్ట్ వెర్షన్లపై రూ.10 వేల వరకు ధరలు పెరిగాయి. ప్రస్తుతం, ఇన్నోవా క్రిస్టా కారు రూ.19.99 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది.
టయోటా ఇన్నోవా క్రిస్టా మోడల్ ని GX, GX ప్లస్, VX, మరియు ZX అనే నాలుగు వేరియంట్లలో 7-సీటర్ మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో పొందవచ్చు. ధరలలో మార్పుల విషయానికి వస్తే, 7-సీటర్ మరియు 8-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందించబడిన GX ప్లస్ వేరియంట్ పై మాత్రమే రూ.10 వేల వరకు ధర పెరగడంతో, ఇది కాస్తా ఇప్పుడు ప్రియంగా మారింది. ముఖ్యంగా, ఈ వేరియంట్ 2024 ప్రారంభంలో లేటెస్టుగా ఎంపివి లైనప్ కి జతచేయబడింది.
మెకానికల్ గా, ఇన్నోవా క్రిస్టా కారు 2.4-లీటర్ డీజిల్ ఇంజిన్ తో రాగా, ఈ ఇంజిన్ 148bhp మరియు 343Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది కేవలం 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్సుతో జతచేయబడింది.
వేరియంట్-వారీగా టయోటా ఇన్నోవా క్రిస్టా కారు ఎక్స్-షోరూం ధరలు క్రింది విధంగా ఉన్నాయి:
వేరియంట్లు | ఎక్స్-షోరూం ధర | వ్యత్యాసం (రూ.) |
GX 7-సీటర్ | రూ. 19.99 లక్షలు | - |
GX 8- సీటర్ | రూ. 19.99 లక్షలు | - |
GX ప్లస్ 7- సీటర్ | రూ. 21.49 లక్షలు | రూ. 10,000 |
GX ప్లస్ 8- సీటర్ | రూ. 21.54 లక్షలు | రూ. 10,000 |
VX 7- సీటర్ | రూ. 24.89 లక్షలు | - |
VX 8- సీటర్ | రూ. 24.94 లక్షలు | - |
ZX 7- సీటర్ | రూ. 26.55 లక్షలు | - |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్