- రూ.11.14 లక్షలతో ధరలు ప్రారంభం
- ఈ సంవత్సరంలో ప్రారంభంలో 39 వారాలుగా ఉన్న వెయిటింగ్ పీరియడ్
లేటెస్టు డేటా ప్రకారం టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్ కారుపై వెయిటింగ్ పీరియడ్ చాలా తగ్గింది. ఈ ఏడాది మార్చిలో హ్యుందాయ్ క్రెటా మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో పోటీగా ఉన్న మిడ్-సైజ్ ఎస్‍యూవీపై 39 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండేది.
సెప్టెంబరు-2024 నాటికి ఉన్న వెయిటింగ్ పీరియడ్ ని పరిశీలిస్తే, అర్బన్ క్రూజర్ హైరైడర్ ఎనిమిది వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ని కలిగి ఉంది, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ వెయిటింగ్ పీరియడ్ సిఎన్‍జివెర్షన్ కార్లకు మాత్రమే వర్తిస్తుంది. అదే విధంగా, హైరైడర్ కారులోని మైల్డ్-హైబ్రిడ్ మరియు స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ కారును బుకింగ్ తేదీ నుండి కేవలం నాలుగు వారాల పాటు మాత్రమే వేచి ఉండాల్సి ఉంటుంది.
ప్రస్తుతం, టయోటా హైరైడర్ కారు మొత్తం మూడు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఈ కారులో మీకునాలుగు వేరియంట్లు లభిస్తాయి. ఇంకా కలర్స్ విషయానికి వస్తే, ఈ కారు అన్నీ వేరియంట్లలో 11 కలర్లలో అందుబాటులో ఉంది. ఇక్కడ అందించిన కలర్లలో, మీరు ఈ కారును ఏడు మోనో టోన్ మరియు నాలుగు డ్యూయల్-టోన్ కలర్లలో పొందవచ్చు. పోటీ విషయానికి వస్తే, ఈ టయోటా హైరైడర్ కారుతో కియా సెల్టోస్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్, స్కోడా కుషాక్, ఎంజి ఆస్టర్, మారుతి గ్రాండ్ విటారా, హోండా ఎలివేట్ మరియు హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు పోటీపడుతున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్