- ఇండియాలో రూ.11.14 లక్షలతో హైరైడర్ ధరలు ప్రారంభం
- 11 కలర్లు మరియు 4 వేరియంట్లలో లభ్యం
మార్చి నెలకు సంబంధించి టయోటా కిర్లోస్కర్ మోటార్ దాని సెలెక్టెడ్ మోడల్స్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ని అప్డేట్ చేసింది. ఈ ఆర్టికల్ లో, టయోటా నుంచి వచ్చిన అర్బన్ క్రూజర్ హైరైడర్ యొక్క వెయిటింగ్ టైంలైన్ వివరాలను తెలుసుకుందాం.
ప్రస్తుతం, టయోటా హైరైడర్ పై 9-10 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, ఇది నియో డ్రైవ్ (మిడ్-హైబ్రిడ్) వేరియంట్లపై వర్తించనుంది. అదే విధంగా, కస్టమర్స్ ఎవరైతే సిఎన్జి మరియు స్ట్రాంగ్-హైబ్రిడ్ వేరియంట్లను కొనుగోలు చేయలానుకుంటున్నారో వారు వరుసగా 7 నెలల వరకు మరియు 4 నెలల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.
అర్బన్ క్రూజర్ హైరైడర్ 4 వేరియంట్లలో 11 కలర్లలో అందించబడుతుంది. ఇక కలర్స్ విషయానికి వస్తే, ఈ మోడల్ ని 7 మోనోటోన్ కలర్లలో మరియు 4 డ్యూయల్-టోన్ కలర్లలో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, కస్టమర్స్ దీనిని మైల్డ్-హైబ్రిడ్, స్ట్రాంగ్-హైబ్రిడ్ మరియు సిఎన్జి పవర్ ట్రెయిన్ ఆప్షన్లలో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్