- మరికొన్ని నెలల్లో అప్ డేట్ ని అందుకోనున్న eC3 కారు
- అందుబాటులోకి రానున్న ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ వింగ్ మిర్రర్స్ మరియు మరెన్నో ఫీచర్లు
C3 మరియు C3 ఎయిర్ క్రాస్ వంటి మోడల్స్ లో చాలా తక్కువ ఫీచర్లు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్న తరుణంలో, సిట్రోన్ ఇండియా ఒక గుడ్ న్యూస్ తో మన ముందుకు వచ్చింది. అదేంటి అంటే, ఈ రెండు కార్లను మరింత మెరుగుపరుస్తూ వీటిలో అప్ డేట్లను తీసుకురానుంది. కొత్త అప్ డేట్ ద్వారా, C3 కారులో మిస్సయిన చాలా ఫీచర్లతో ఈ హ్యచ్ బ్యాక్ బెనిఫిట్స్ పొందుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, లేటెస్టుగా మహేంద్ర సింగ్ ధోని సిట్రోన్ బ్రాండ్ అంబాసిడర్ గా నియమితుడయ్యాడు.
అప్ డేటెడ్ C3 కారు లేటెస్టుగా లాంచ్ అయిన బసాల్ట్ కూపే ఎస్‍యూవీ నుంచి చాలా ఫీచర్లను తీసుకోనుంది. ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పవర్డ్ వింగ్ మిర్రర్, రీపొజిషన్డ్ రియర్ విండో స్విచ్‌లు, ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్ మరియు పెద్ద 7-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇప్పుడు, eC3గా పిలువబడుతున్న ఎలక్ట్రిక్ వెర్షన్ C3 కూడా ఇవే ఫీచర్లతో వస్తుందని భావిస్తున్నాం.
ప్రస్తుతం సిట్రోన్ eC3 ఎలక్ట్రిక్ కారు రూ.11.61 లక్షల ధరతో అందించబడుతుండగా, దీనిని లైవ్, ఫీల్, మరియు షైన్ అనే మూడు వేరియంట్లలో పొందవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ కారులోని ఫీల్ మరియు షైన్ వేరియంట్లలో వైబ్ ప్యాక్, డ్యూయల్-టోన్, మరియు బ్లూ ఎడిషన్ వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
eC3 ఎలక్ట్రిక్ కారు 29.2kWh బ్యాటరీ ప్యాక్ తో రాగా, ఇది కారు ముందు చక్రాలపై ఉన్న సింగిల్ మోటారుతో జతచేయబడింది. ఈ మోటార్ 56bhp మరియు 143Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, సింగిల్ ఛార్జ్ ద్వారా320 కిలోమీటర్ల క్లెయిమ్డ్ డ్రైవింగ్ రేంజ్ ని అందిస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్