- ఈవీ స్పేస్ కొత్తగా ఎంట్రీ ఇవ్వనున్న మారుతి మరియు కియా
- సి-సెగ్మెంట్ మరియు దానిపైగానే ఉండనున్న అన్నీ మోడల్స్
2024 మరింత ఆసక్తికరంగా ఉండనుంది. వచ్చే సంవత్సరం ఇండియాలోని ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోకి కొన్ని ఆసక్తికరమైన కొత్త ఎంట్రీలతో పాటుగా ఇప్పటికే ఉన్న చాలా బీఈవీకంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను లాంచ్ చేయడం ద్వారా తమ మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఈ లిస్టులో ఉన్న అనేక కార్లు ఆటో మార్కెట్ కు ప్రీమియం అంశాలను జోడించి వాటిని మరింత ముందుకు తీసుకువెళ్లనున్నాయి, ఇండియాలో టాప్ లో కొనసాగనున్న కొత్త ఈవీలను లిస్టును మీకోసం సిద్ధం చేశాము.
టాటా కర్వ్ ఈవీ
టాటా నుంచి 2024లో అరంగేట్రం చేసిన అతి ప్రాముఖ్యమైన ఈవీ ఇది. కర్వ్ కాన్సెప్ట్ దాని ఐసీఈ ఆధారంగా వచ్చింది మరియు భవిష్యత్ లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, కియా కారెన్స్ మరియు హోండా, ఫోక్స్‌వ్యాగన్, స్కోడా మరియు ఎంజి ZS ఈవీలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనం ఎంత తెలుసుకున్నాం ? కొత్త నెక్సాన్ ఈవీ ద్వారా స్టీరింగ్ మరియు ఏసీ కంట్రోల్స్ లాంటి అంశాలని తెలుసుకున్నాం, అవే ఫీచర్స్ కర్వ్ లో కూడా ఉండనున్నాయి. ఇది వేరియంట్ ని బట్టి వివిధ రేంజ్ ఆప్షన్స్ లో 400-500 కి.మీ. వరకు మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది.
మహీంద్రా XUV.e8
మహీంద్రా నుంచి వచ్చిన 2వ బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్(బీఈవీ) XUV.e8 అని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే, ఎక్స్‌యూవీ700 యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్ 2024 అక్టోబరులో వచ్చే అవకాశం ఉంది. కొలతల పరంగా ఇది కూడా అచ్చం ఎక్స్‌యూవీ700 లాగానే ఉండనుంది మరియు ఫుల్ చార్జ్ తో 450 కి.మీ. రేంజ్ వరకు మైలేజీని ఇవ్వనుంది. XUV.e8 యొక్క క్యాబిన్, ఫీచర్స్, సేఫ్టీ సూట్ కూడా ఎక్స్‌యూవీ700 లాగే ఉండనుంది. ఆటోమేకర్‌కి ఇది ఒక ముఖ్యమైన కారు అని చెప్పవచ్చు, ఎందుకంటే ఈ కంపెనీ నుంచి వస్తున్న మొత్తం కార్లు ఎలక్ట్రిక్ యుగంలోకి వెళ్లే ముందు మహీంద్రా కంపెనీకి ఇదే చిట్ట చివరి ఎలక్ట్రిక్ కారు.
టాటా సియెర్రా ఈవీ
బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్(బీఈవీ)యుగంలో టాటా దాని క్లాసిక్ బ్రాండ్లలో ఒకటైన ది కింగ్ ఆఫ్ ది హిల్ ను అప్ డేట్ చేయనుంది. దీనిని 2020 ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించారు మరియు తర్వాత 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రొడక్షన్ కి చేరువలో ఉన్నట్లు పేర్కొన్నారు. సియెర్రా ఈవీ కూడా హారియర్/సఫారీ ఈవీ లాగే ఒకే రకమైన ఫీచర్స్, పవర్ ట్రెయిన్, క్యాబిన్ లేఅవుట్ ని కలిగి ఉంది. ఒకవేళ మీరు దాని వెనుక ఉన్న పేరు మరియు పొజిషన్ చూస్తే, బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ కి సంబంధించి టాటా బ్రాండ్ నమ్మకానికి గుర్తుగా నిలిచిపోనుంది.
మారుతి ఈవీఎక్స్
2024 సంవత్సరంలో ఇండియాలో మరొక కారు మారుతి బ్రాండ్ నుంచి రానుంది. కొంత వరకు ఆలస్యంగా వస్తున్నా గట్టి పోటీనివ్వడానికి సిద్ధంగా ఉంది. మారుతి ఈవీఎక్స్ ఆటోమేకర్ నుంచి వస్తున్న మొదటి బోర్న్ ఎలక్ట్రిక్ వెహికిల్(బీఈవీ) మరియు ఇవన్నీ గుజరాత్ ప్లాంట్ ఉత్పత్తి చేయబడి ప్రపంచవ్యాప్తంగా సరఫరా చేయనున్నారు. ఇది అధికారికంగా 2025 ప్రారంభంలో పండుగ సీజన్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇది 500 కి.మీ. రేంజ్ ని అందించడంతో పాటు ప్రస్తుతం విక్రయిస్తున్న ప్రీమియం మారుతి కార్లకు సమానంగా క్యాబిన్ కలిగి ఉండనుంది. రాబోయే కాలంలో ఈవీఎక్స్ జిమ్నీ, ఫ్రాంక్స్, బాలెనో మరియు ఎర్టిగా యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్స్ తో చేరవచ్చని ఆటో ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
టయోటా అర్బన్ ఎస్‍యూవీ కాన్సెప్ట్
అచ్చం మారుతి ఈవీఎక్స్ లాగా అనిపించే ఈ టయోటా మోడల్ కాన్సెప్ట్ రూపం అర్బన్ ఎస్‍యూవీ కాన్సెప్ట్ రూపంగా ప్రదర్శించబడింది. ఈ వాహనం ఈవీఎక్స్ కంటే కొంచెం భిన్నంగా ఉండనుంది, అదేవిధంగా ఈవీఎక్స్ లాగే 500 కి.మీ. రేంజ్ అందించడమే కాకఇంటీరియర్ ఫీచర్స్, కొలతలు మరియు సేఫ్టీ సూట్‌ను కూడా పొందుతుంది. ఇది ఈవీఎక్స్కంటే కొంచెం ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చని మరియు వివిధ ఆప్షన్స్ లో రావచ్చని భావిస్తున్నాము.
కియా EV9
ఆటో ఎక్స్‌పో 2023లో మొదటిసారిగా ప్రదర్శించబడిన Kia EV9 బ్రాండ్ E-GMP ప్లాట్‌ఫారమ్‌పై ఆధారంగా వస్తుంది. దీనిని ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 541కి.మీ.ల డ్రైవింగ్ రేంజ్ ని చాలా ఈజీగా అందుకోవచ్చు. బహుశా ఇది సింగిల్, టాప్-స్పెక్ వేరియంట్‌లో మాత్రమే అందించబడుతుందని అంచనా, 3- వరుసల ఎలక్ట్రిక్ ఎస్‍యూవీ 2024 చివరిలో ఇండియన్ మార్కెట్లో ప్రవేశించవచ్చని ఆటో ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. కియా EV9 లాంచ్ అయిన తర్వాత, బిఎండబ్ల్యూ iX మరియు అప్ కమింగ్ వోల్వో EM90తో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్