- సింగిల్ టాప్-స్పెక్ వేరియంట్లో అందించబడుతున్న కేమ్రీ
- తాజాగా ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అయిన న్యూ-జెన్ కేమ్రీ
టయోటా కిర్లోస్కర్ మోటార్స్ ఫ్లాగ్‌షిప్ సెడాన్ కేమ్రీ ప్రస్తుతం రూ. 46.17 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. ఇక తాజాగా దీనిపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ విషయానికి వస్తే, డిసెంబరు-2023లో ఈ మోడల్ పై ఒక నెల పాటు వెయిటింగ్ పీరియడ్ ఉండనుంది.
పైన పేర్కొన్న ఈ వెయిటింగ్ పీరియడ్ ఇండియా వ్యాప్తంగా వర్తించనుంది. ఆసక్తి కలిగిన కస్టమర్స్ మీకు సమీపంలో ఉన్న టయోటా-అధికారిక డీలర్‌షిప్ లేదా టయోటా కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి టయోటా కేమ్రీ హైబ్రిడ్ సెడాన్‌ను బుక్ ఈ మోటార్ చేసుకోవచ్చు.
ఇందులోని మెకానికల్ అంశాల గురించి చెప్పాలంటే, టయోటా కేమ్రీ 2.5-లీటర్ పెట్రోల్-హైబ్రిడ్ ఇంజిన్ సివిటి గేర్ బాక్సుతో జతచేయబడింది. అలాగే ఇది 215bhp పవర్ మరియు 221Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇంకా చెప్పాలంటే, కేమ్రీ ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్ తో అందించబడుతుంది.
తాజాగా, ఈ జపనీస్ ఆటోమేకర్ ప్రపంచవ్యాప్తంగా న్యూ-జెన్ కేమ్రీని ఆవిష్కరించింది. తాజా ఇటరేషన్ కేమ్రీలో భారీ రీడిజైన్డ్ ఎక్స్‌టీరియర్, అప్‌లిఫ్టెడ్ ఇంటీరియర్ మరియు కొత్త హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ ఉండనున్నాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్