చాలా మంది ప్రజలు భారీ ఇంజిన్లు మరియు అధిక ధర లో అత్యధిక పవర్ అవుట్‌పుట్ తో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అందించే హై-ఎండ్ కార్లను ఇష్టపడతారు. అయితే, మనం అనుకున్నధరలో గ్రేట్ పెర్ఫార్మెన్స్ అందించేలా రూపొందించబడిన కొన్ని కార్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ కథనంలో, మేము రూ.15 లక్షలు లోపు లభించే టాప్ 5 టర్బో-పెట్రోల్ పెర్ఫార్మెన్స్ కార్లను లిస్ట్ చేసాము.
హ్యుందాయ్ I20 ఎన్ లైన్
i20 ఎన్ లైన్ మొదటిసారిగా 2021లో భారతదేశంలో లాంచ్ చేయబడింది తర్వాత ఇది ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ లో కూడా వచ్చింది. పెర్ఫార్మెన్స్-ఫోకస్డ్ హ్యాచ్‌బ్యాక్ దాని రూపాన్ని మరియు దానితో కూడిన ఇంజిన్‌తో ప్రామాణిక i20 నుండి వేరుగా ఉంటుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్ యూనిట్‌తో జతచేయబడి 1.0-లీటర్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ మోటార్ 118bhp మరియు 172Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. i20 ఎన్ లైన్ రెండు వేరియంట్స్ లో రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
మహీంద్రా ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్
మహీంద్రా తన ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్ లో పెర్ఫార్మెన్స్-ఓరియంటెడ్ వెర్షన్‌ను అక్టోబర్ 2022లో భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఎస్‌యువి 1.2-లీటర్ ఎంస్టాలిన్ టిజిడిఐ పెట్రోల్ ఇంజిన్ 128bhp మరియు 250Nm మాక్సిమమ్ టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. దీని మోటార్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ యూనిట్‌తో జత చేయబడింది.పెర్ఫార్మెన్స్ పరంగా చూస్తే, ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్ 0 నుండి 100kmph వేగాన్నికేవలం 10.67 సెకన్లలోనే అందుకోగలదు (కార్‍వాలే టెస్టెడ్ ). ఎస్‌యువిను 4 వేరియంట్లలో రూ. 9.30 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
హ్యుందాయ్ వెన్యూ ఎన్ లైన్
i20 ఎన్ లైన్ మాదిరిగానే, వెన్యూ ఎన్ లైన్ స్టాండర్డ్ హ్యుందాయ్ వెన్యూ యొక్క పవర్ ఫుల్ వెర్షన్ అని చెప్పవచ్చు. ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిసిటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ మోటారు ద్వారా పవర్ ని పొందుతుంది. మోటార్ బిఎస్6 ఫేజ్ 2.0-కంప్లైంట్ కి అనుగుణంగా 118bhp మరియు 172Nm మాక్సిమమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. అయితే, ఈ ఎస్‌యువి రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది - N6 మరియు N8. దీని ప్రారంభ ధర రూ. 12.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
హ్యుందాయ్ ఫ్రాంక్స్
మారుతి సుజుకి బూస్టర్‌జెట్ ఇంజిన్ ఏప్రిల్ 2023లో భారతదేశంలో ఫ్రాంక్స్ క్రాస్‌ఓవర్‌తో తిరిగి వచ్చింది. ఈ 1.0-లీటర్ 3-సిలిండర్ టర్బో-పెట్రోల్ మోటార్ 99bhp మరియు 147Nm టార్క్‌ను ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌తో 3 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది . మారుతి సుజుకి ఫ్రాంక్స్ టర్బో వేరియంట్స్ ని ధర రూ. 9.72 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
సిట్రోన్ సి3 టర్బో
సిట్రోన్ సి3 1.2-లీటర్ 3-సిలిండర్ టర్బో పెట్రోల్ మోటారు క్లాస్ లో వచ్చిన పవర్ ఫుల్ హ్యాచ్‌బ్యాక్‌లలో ఇది ఒకటి అని చెప్పవచ్చు. ఈ ప్యూర్ టెక్ 110 ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి 109bhp మరియు 190Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. సి3 లోని ఫీల్ అండ్ షైన్ వేరియంట్‌లను టర్బో ఇంజిన్‌తో రూ. 8.28 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మీరు ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు:రాజపుష్ప