- 2024లో లాంచ్ కానున్న 5-డోర్ థార్
- ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తో లాంచ్ అయ్యే అవకాశం
5-డోర్ థార్ ను వచ్చే సంవత్సరం లాంచ్ చేయాలని భావిస్తున్న మహీంద్రా, దీనిని ఇంకా టెస్టింగ్ చేస్తూనే ఉంది. ఇంటర్నెట్ లో వైరల్ గా మారిన కొత్త స్పై షాట్స్ ని చూస్తుంటే దీనికి సంబంధించిన కీలక ఫీచర్స్ గురించి మనకు కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నాయి.
ఇక్కడ ఉన్న ఫోటోలను చూస్తుంటే, విజువల్ అప్ డేట్స్ పరంగా మహీంద్రా 5-డోర్ థార్ లో కొత్త గ్రిల్, ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ట్వీక్డ్ ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు కొత్త సెట్ తో అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. లోపల చూస్తే ఇంటీరియర్ పరంగా, భారీ టచ్ స్క్రీన్ యూనిట్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్, మరియు రెండవ వరుసలో ప్రత్యేకమైన బెంచ్ సీట్ సెటప్ ని కలిగి ఉంది.
హుడ్ కింద చూస్తే, ఫ్యూచర్ ఇటరేషన్ లో వస్తున్న మహీంద్రా థార్ లో ఇంతకు ముందు 3-డోర్ థార్ వెర్షన్ లో చూసిన విధంగా అవే పవర్డ్ 2.0-లీటర్ ఎంస్టాలిన్ టర్బో పెట్రోల్ ఇంజిన్ మరియు 2.0-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఉండనున్నాయి. ఇంకా 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ యూనిట్స్ కూడా ఏమాత్రం మారకుండా అలానే ఉండనున్నాయి.
మూలం: ఆటో కార్ ఇండియా
అనువాదించిన వారు: సంజయ్ కుమార్