ఇటీవల కాలంలో చాలా మంది ప్రజలు తక్కువ ఖర్చుతో కూడుకున్నసౌకర్యాన్ని, బెస్ట్ పెర్ఫార్మెన్స్ ని అందించే కార్లను ఇష్టపడుతున్నారు. అయితే, మనం అనుకున్న ధరలో గ్రేట్ పెర్ఫార్మెన్స్ అందించేలా రూపొందించబడిన కొన్నిమహీంద్రా కార్లు భారతదేశంలో ఉన్నాయి. ఈ కథనంలో, మేము రూ.15 లక్షలు లోపు లభించే మహీంద్రా బ్రాండ్ నుంచి లభిస్తున్న టాప్- 5 కార్లను లిస్ట్ చేసాము.
మహీంద్రా థార్
మహీంద్రా థార్ ఇండియాలో ఏప్రిల్ 12, 2023న లాంచ్ అయింది. థార్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది: అవి, AX Opt మరియు LX. థార్ ఎక్స్‌టీరియర్ లో ముఖ్యంగా సిగ్నేచర్ మల్టీ-స్లాట్ గ్రిల్, రౌండెడ్ హెడ్‌ల్యాంప్స్, 18-ఇంచ్ 5-స్పోక్ అల్లాయ్ వీల్స్ మరియు డ్యూయల్-టోన్ బంపర్స్ వంటివి ఉన్నాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ యూనిట్స్ ను ఉన్నాయి. థార్ 4x4 4డబ్ల్యూడిసిస్టమ్‌ను పొందుతుంది. ఇందులో నలుగురు కూర్చునే సీటింగ్ కెపాసిటీ ఉంది. దీనిని రూ. 10,98 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
ఎక్స్‌యువి300
మహీంద్రా ఎక్స్‌యువి300 ఫిబ్రవరి 2019లో పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్, 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో కూడిన రెండు పవర్ ట్రెయిన్ ఆప్షన్స్ లో ఇండియాలో ప్రవేశించింది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ మరియు ఏఎంటి యూనిట్ అనేట్రాన్స్మిషన్ ఆప్షన్స్ లో ఉన్నాయి. లోపలి వైపు, మహీంద్రా ఎక్స్‌యువి300 సన్‌రూఫ్, ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు బ్లూసెన్స్ టెక్నాలజీతో కూడిన 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఈ మోడల్ లో ఐదుగురు కూర్చునేలా సీటింగ్ కెపాసిటీ ఉంది. మహీంద్రా ఎక్స్‌యువి300ని రూ. 7.99 లక్షలు(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
బొలెరో
మహీంద్రా బొలెరో బిఎస్6 కొత్త హెడ్‌ల్యాంప్స్ స్టాటిక్ బెండింగ్ హెడ్‌ల్యాంప్స్, వెనుక వాషర్ మరియు వైపర్ మరియు ఫాగ్ ల్యాంప్‌లతో కూడిన రీడిజైన్డ్ ఫాసియా ఉన్నాయి. ఇది 3,600rpm వద్ద 75bhp మరియు 1,600-2,200rpm మధ్య 210Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడిఉంది.ఈ మోడల్ ను B4, B6 మరియు B6 (O) 3 వేరియంట్స్ లో పొందవచ్చు. మహీంద్రా బొలెరోని రూ. 9,79,500 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మీరు పొందవచ్చు.
స్కార్పియో ఎన్
మహీంద్రా 14 ఏప్రిల్, 2023న ఇండియాలో బిఎస్6 ఫేజ్ 2-కంప్లైంట్ స్కార్పియో ఎన్ ని విడుదల చేసింది. మహీంద్రా స్కార్పియో ఎన్ Z2, Z4, Z6, Z8 మరియు Z8L అనే వివిధ రకాల వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో రెండూ 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కలిపి ఉంటాయి. ఇందులో ఉన్న ఇంటీరియర్ గురించి మాట్లాడితే, స్కార్పియో ఎన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ మరియు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది. 4Xplor అని పిలువబడే 4x4 సిస్టమ్ కొన్ని డీజిల్ వెర్షన్‌లకు ఇది ప్రత్యేకమైనదని మనం గమనించాలి. స్కార్పియో ఎన్ ని రూ. 13,26,400 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.
ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్
ఎక్స్‌యువి300 మాదిరిగానే ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ డిజైన్‌ను కలిగి ఉంది. ఎస్‌యువి W6, W8 మరియు W8 (O) అనే మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఎక్స్‌యువి300 టర్బోస్పోర్ట్ సీట్స్, గేర్ స్టిక్ మరియు స్టీరింగ్ వీల్ కోసం లెథెరెట్ అప్హోల్స్టరీతో కూడిన ఆల్-బ్లాక్ క్యాబిన్‌ను కలిగి ఉంది. ఇది ఓవర్-బూస్ట్ ఫంక్షన్‌తో క్లెయిమ్ చేయబడిన 250Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడింది. దీనిని రూ.9,30,501(ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో పొందవచ్చు.