- సిటీ మరియు హైవేలపై మైలేజీ టెస్టింగ్
- టూ-పెడల్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్ తో వచ్చిన మొదటి సిఎన్‍జి కాంపాక్ట్ సెడాన్
ఫస్ట్ ఇన్ సెగ్మెంట్
ఈ సంవత్సరం ప్రారంభంలో సిఎన్‍జి సెగ్మెంట్లో టియాగో మరియు టిగోర్ సిఎన్‍జి ఎఎంటి ద్వారా టాటా దాని పోటీని ప్రారంభించింది. ఈ కార్లు లాంచ్ అయినప్పుడు, టియాగో సిఎన్‍జి ఎఎంటిని డ్రైవ్ చేయడంతో పాటుగా దాని రియల్ వరల్డ్ మైలేజీని కూడా టెస్ట్ చేశాము. అదే విధంగా ఇప్పుడు, టిగోర్ సిఎన్‍జి ఎఎంటిని కూడా టెస్ట్ చేయగా, దాని రియల్ వరల్డ్ మైలేజీని ఇక్కడ మీకు అందిస్తున్నాము.
రియల్ వరల్డ్ మైలేజీ
టిగోర్ సిఎన్‍జి ఎఎంటి కారు 28.06కిమీ/కేజీ మైలేజీని అందిస్తుందని టాటా అధికారికంగా పేర్కొంది. ముందుగా మేము అనుకున్న సిటీ రూట్లలో, ఐడియల్ కండిషన్లలో ఈ సిఎన్‍జి హ్యచ్ బ్యాక్ ని 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయగా, ఇది 17.39కిమీ/కేజీ రియల్-వరల్డ్ మైలేజీని అందించింది. మరో వైపు, ఇదే కారును హైవేలపై 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయగా, ఇది 22.10కిమీ/కేజీ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందించింది.
స్పెసిఫికేషన్లు
టిగోర్ సిఎన్‍జి ఎఎంటి కారు సిఎన్‍జి టైప్ లో 72bhp/95Nm టార్కును ఉత్పత్తి చేసే టాటా 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో వచ్చింది. ఇది 5-స్పీడ్ ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో జతచేయబడి రాగా, దీన్ని 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్ తో కూడా పొందవచ్చు. ఈ ఇంజిన్ పెట్రోల్ టైప్ లో 85bhp/113Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని కూడా 5-స్పీడ్ ఎంటి లేదా 5-స్పీడ్ ఎఎంటి యూనిట్ తో పొందవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్