- మాక్సిమం వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉన్న సిఎన్‍జి వేరియంట్స్
- ఇప్పుడు సిఎన్‍జి ఎఎంటిలో కూడా లభ్యం
టాటా టియాగో ఇండియాలో లాంచ్ అయినప్పటి నుండి చాలా పాపులారిటీని పొందింది. ఇది కాంపాక్ట్ సైజ్ లో మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ ఆప్షన్ లో అందుబాటులో ఉండడమే దీనికి కారణమని చెప్పవచ్చు. దీనికి ప్రతిఫలంగా, ఈ మోడల్ పై వెయిటింగ్ పీరియడ్ పెరిగింది. కానీ ఈ నెలలో దీనిపై చాలా వరకు వెయిటింగ్ పీరియడ్ తగ్గుతుందనే విషయాన్ని మనం ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ప్రస్తుతం, టియాగో యొక్క సిఎన్‍జి వేరియంట్‌లు పెట్రోల్ వేరియంట్‌ల కంటే మాక్సిమం వెయిటింగ్ పీరియడ్‌ని కలిగి ఉన్నాయి. పెట్రోల్ వేరియంట్‌లపై 2 నుండి 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉండగా, సిఎన్‍జి వేరియంట్‌ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న కస్టమర్‌లు బుకింగ్ చేసుకున్న రోజు నుండి 6 వారాల వరకు వేచి ఉండవలసి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, పైన పేర్కొన్న ఈ వెయిటింగ్ పీరియడ్ ముంబై ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంది. అలాగే, డీలర్, వేరియంట్, కలర్, గేర్‌బాక్స్ మరియు ఇతర కారకాలపై ఆధారపడి ఈ టైమ్‌లైన్ మారవచ్చు.
ఇప్పుడు, ఎఎంటి గేర్‌బాక్స్‌ను టియాగో యొక్క సిఎన్‍జి వేరియంట్‌లలో కూడా పొందవచ్చు. ఈ మోడల్ 1.2-లీటర్ పెట్రోల్ మోటార్, 5-స్పీడ్ ఎఎంటి యూనిట్‌తో పాటు కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్‌తో జత చేయబడి 72bhp మరియు 95Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది, అలాగే, ఇది 28.06కిమీ/కేజీ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప