- అక్టోబర్ 17న లాంచ్ కానున్న టాటా హారియర్ ఫేస్ లిఫ్ట్
- రూ.5.60 లక్షలతో ప్రారంభంకానున్న టియాగో ధరలు
ఇండియాలో పంచ్, ప్రీ-ఫేస్ లిఫ్ట్ సఫారి, అల్ట్రోజ్, టియాగో, హారియర్ మరియు ఇంకా మరికొన్ని సెలెక్టెడ్ కార్లపై టాటా మోటార్స్ వెయిటింగ్ పీరియడ్ ని ప్రకటించింది. ఆ ఆర్టికల్ లో, మనం టియాగో, హారియర్ మరియు ఇంకా కంపెనీకి చెందిన మరిన్ని ఎంట్రీ లెవెల్ మోడల్స్ యొక్క వెయిటింగ్ పీరియడ్ ని తెలుసుకుందాం.
టాటా హారియర్ వెయిటింగ్ పీరియడ్
టాటా హారియర్ ను మొదటగా 2017లో లాంచ్ చేయగా, అప్పటి నుంచి ఈ వెహికిల్ ఒకే ఒక్క అప్ డేట్ పొందింది. అది కూడా ఈ సంవత్సరం మొదట్లో వచ్చింది. అయితే, సరికొత్త హారియర్ ను అక్టోబర్ 17, 2023న ఆవిష్కరించనున్నారు. అలాగే, కస్టమర్స్ ఎవరైతే ప్రస్తుత వెర్షన్ ను కొనుగోలు చేయాలనుకుంటున్నారో వారు ఈ వెహికిల్ డెలివరీ పొందడానికి 8 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ హారియర్ ఎస్యువి XE, XM, XMS, XT+, XZ, XZ+, మరియు XZA+(O) వేరియంట్స్ లో, ప్రారంభ ధర రూ. 15.20 లక్షలు (ఎక్స్-షోరూం)తో అందుబాటులో ఉంది.
టాటా టియాగో వెయిటింగ్ పీరియడ్
సిఎన్జి-పవర్డ్ టాటా టియాగోను కొనుగోలు చేయాలనుకునే కస్టమర్స్ బుకింగ్ చేసిన తేదీ నుంచి 8 వారాల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. మరోవైపు, పెట్రోల్ వెర్షన్స్ పై 4 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. దయచేసి గమనించండి ఈ టైంలైన్ ముంబై రీజియన్ కు మాత్రమే వర్తిస్తుంది. అయితే, టియాగో హ్యచ్ బ్యాక్ 5 కలర్స్ లో XE, XM, XT(O), XT, XZ+, XT NRG, మరియు XZ NRG అనే 7 వేరియంట్స్ లో అందించబడుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్