- ఇండియాలో లాంచ్ అయిన మొదటి సిఎన్‍జి ఎఎంటి కారు
- కేవలం 21,000 రూపాయలతో ప్రారంభమైన బుకింగ్స్
టాటా మోటార్స్ టియాగో సిఎన్‍జి ఎఎంటి మోడల్ ని లాంచ్ చేయగా, దానితో పాటుగా దీని బుకింగ్స్ కూడా ప్రారంభించింది. ప్రస్తుతం 21,000 రూపాయలతో ఈ మోడల్ బుకింగ్స్ ప్రారంభం కాగా, ఇప్పుడు లోకల్ డీలర్‌షిప్స్ వద్దకు చేరుకుంది.
ఇక్కడ ఫోటోలలో చూసినట్లుగా, టాటా టియాగో సిఎన్‍జి కారు టోర్నడో బ్లూ అనే కొత్త కలర్ ఫినిషింగ్ తో వచ్చింది. ప్రత్యేకించి, ఈ హ్యచ్ బ్యాక్ యొక్క ఆటోమేటిక్ సిఎన్‍జి వెర్షన్ XT మరియు XZ+ అనే రెండు వేరియంట్లలో అందించబడింది. ఇందులో ఎల్ఈడీ డీఆర్ఎల్స్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, 14-ఇంచ్ వీల్స్, టిపిఎంఎస్, 7-ఇంచ్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, కూల్డ్ గ్లోవ్ బాక్స్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
2024 టియాగో సిఎన్‍జి ఆటోమేటిక్ యొక్క 1.2-లీటర్, 3-సిలిండర్, రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్ ఎఎంటి యూనిట్ తో జత చేయబడింది. ఈ మోటార్ పెట్రోల్ మోడ్ లో 85bhp మరియు 113Nm టార్కును మరియు సిఎన్‍జి మోడ్ లో 72bhp మరియు 95Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్