- అందుబాటులో ఉన్న 5 వేరియంట్స్
- ప్రారంభ ధర రూ.10.99 లక్షలు
టాటా మోటార్స్ తన 4వ ఆల్-ఎలక్ట్రిక్ ఉత్పత్తి అయిన పంచ్ ఈవీని గత వారం ఇండియాలో లాంచ్ చేసింది. ఈ మోడల్ (పంచ్ ఈవీ)ని ప్రారంభ ధర రూ. 10.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో పొందవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పంచ్ ఈవీడెలివరీలు మొదలయ్యాయి.
టాటా పంచ్ ఈవీని స్మార్ట్, స్మార్ట్+, అడ్వెంచర్, ఎంపవర్డ్ మరియు ఎంపవర్డ్+ అనే 5 వేరియంట్స్ లో పొందవచ్చు. మొదటి రెండు స్టాండర్డ్ రేంజ్ వెర్షన్‌ని మాత్రమే కలిగి ఉండగా, మిగిలిన మూడు స్టాండర్డ్ మరియు లాంగ్ రేంజ్ రూపంలో ఉన్నాయి.
అంతేకాకుండా, ఎలక్ట్రిక్ పంచ్‌లో రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఉన్నాయి -ఇందులో మొదటి 25kWh యూనిట్ 315కిమీ క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుండగా,మరియు 35kWh యూనిట్ 421 కిమీ క్లెయిమ్డ్ రేంజ్ ని అందిస్తుంది. అలాగే, లాంగ్ రేంజ్ వెర్షన్ 190Nm పీక్ టార్క్ పవర్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, టాప్-స్పెక్ ఎంపవర్డ్+ వేరియంట్ పెద్ద 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు ఆటో-డిమ్మింగ్ ఐఆర్‍విఎంతో లోడ్ చేయబడింది. అలాగే, ఇందులో బ్లైండ్ స్పాట్ మానిటర్, 360-డిగ్రీ సరౌండ్ కెమెరా, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రీజెన్ మోడ్స్ లోపాడిల్ షిఫ్టర్లు, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు టచ్-బేస్డ్ హెచ్ విఎసి ప్యానెల్ వంటి ఫీచర్లు కూడా ఆఫర్‌లో ఉన్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప