- 5 వేరియంట్లలో అందుబాటులో ఉన్ననెక్సాన్ ఎఎంటి వెర్షన్
- ఈ నెల ప్రారంభంలో డార్క్ ఎడిషన్ రేంజ్ ని పరిచయం చేసిన టాటా
టాటా మోటార్స్ నెక్సాన్ రేంజ్ లో 5 కొత్త వేరియంట్‌లను ప్రవేశపెట్టింది, వీటి ధరలు రూ. 10 లక్షలతో (ఎక్స్-షోరూమ్) ప్రారంభమయ్యాయి. కార్‌మేకర్ నెక్సాన్ పెట్రోల్ మరియు డీజిల్ లకు ఎఎంటి వెర్షన్‌లను జోడించింది. ఇది గతంలో క్రియేటివ్ వేరియంట్ల కంటే ఎక్కువ అందుబాటులో ఉండేవి. ముఖ్యంగా, నెక్సాన్ డార్క్ ఎడిషన్ రేంజ్ వేరియంట్లను కూడా ఈ నెల ప్రారంభంలో లాంచ్ చేసింది. వీటి ధరలు రూ. 11.45 లక్షలతో (ఎక్స్-షోరూమ్)ప్రారంభమయ్యాయి.
పెట్రోల్ లైనప్‌లో, నెక్సాన్ స్మార్ట్+, ప్యూర్ మరియు ప్యూర్ Sఅనే వేరియంట్స్ ఇప్పుడు ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ ను పొందుతాయి. అదేవిధంగా, డీజిల్ రేంజ్ లో ఎఎంటి వేరియంట్‌లు ఇప్పుడు ప్యూర్ మరియు ప్యూర్ S వేరియంట్‌లలో దాని పరిచయంతో అభివృద్ధి పొందింది.
సెలెక్ట్ చేసిన వేరియంట్‌లలో ఎఎంటి యూనిట్‌ను జోడించడమే కాకుండా, టాటా నెక్సాన్ లో ఎలాంటి మార్పు లేదు. ఈ మోడల్ ఇప్పుడు వివిధ పవర్‌ట్రెయిన్ మరియు వేరియంట్ ఆప్షన్స్ లో మొత్తం 95 వేరియంట్లలో అందించబడుతుంది. ఇంకా, వినియోగదారులు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటి మరియు 7-స్పీడ్ డిసిఎ (దీనిని డిసిటి అని కూడా పిలుస్తారు) ట్రాన్స్‌మిషన్‌లతో జత చేసిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను ఎంచుకోవచ్చు.
వేరియంట్ వారీగా న్యూ కొత్త టాటా నెక్సాన్ ఎఎంటి వేరియంట్స్ యొక్క (అన్ని ధరలు, ఎక్స్-షోరూమ్) ధరలు క్రింది పట్టికలో ఇవ్వబడ్డాయి:
వేరియంట్ | ధర |
నెక్సాన్ పెట్రోల్ స్మార్ట్+ | రూ. 10 లక్షలు |
నెక్సాన్ పెట్రోల్ ప్యూర్ | రూ. 10 .50 లక్షలు |
నెక్సాన్ పెట్రోల్ ప్యూర్ S | రూ. 11 లక్షలు |
నెక్సాన్ డీజిల్ ప్యూర్ | రూ. 11.80 లక్షలు |
నెక్సాన్ డీజిల్ ప్యూర్ S | రూ. 12.30 లక్షలు |
అనువాదించిన వారు: రాజపుష్ప