- మొదటగా ఇండియా, సౌత్ అమెరికాలో లాంచ్ కానున్న కొత్త మోడల్
- ఆటోమేకర్ నుంచి సి-క్యూబ్ ప్రోగ్రాం బేస్డ్ గా వస్తున్న మూడవ కారు
కొన్ని రోజుల క్రితం, ఫ్రెంచ్ ఆటోమేకర్ సిట్రోన్ దాని రాబోయే కూపే ఎస్‍యూవీ బసాల్ట్ ని టీజ్ చేసింది. మొత్తానికి ఇప్పుడు, ఆటోమేకర్ టాటా కర్వ్ తో పోటీపడుతున్న ఈ మోడల్ వివరాలను వెల్లడించింది. మొదట C3Xగా పిలువబడుతుండగా ఈ బసాల్ట్ కారు దేశవ్యాప్తంగా 2024-ద్వితీయార్థంలో లాంచ్ కానుంది.
లుక్స్ పరంగా, బసాల్ట్ హై-రైడింగ్ స్టాన్స్ తో సరికొత్త డిజైన్ ద్వారా సెడాన్ వలె కనిపిస్తుంది. దీని గురించి చెప్పాలంటే, కారు ముందు భాగంలో తాజాగా డిజైన్ చేయబడిన ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్ తో గ్రిల్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్స్, కొత్త అల్లాయ్ వీల్స్, చంకీ వీల్ అర్చెస్, మరియు డ్యూయల్-టోన్ ఎక్స్‌టీరియర్ కలర్ తో అచ్చం C3 ఎయిర్ క్రాస్ కి సరిసమానంగా ఉంది. కారు వెనుక భాగంలో, స్పోర్ట్స్ కారును తలపించేలా ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, సిల్వర్ ఫాక్స్ ప్లేట్, మరియు కారు మధ్య భాగంలో భారీగా ఆకారంలో కనిపించే సిట్రోన్ లోగో వంటివి ఉన్నాయి.
ఇంటీరియర్ పరంగా, లోపల ఈ ఎస్‍యూవీ కూపే వైర్ లెస్ కనెక్టివిటీతో భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, కీలెస్ ఎంట్రీ, వైర్ లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, మరియు క్రూయిజ్ కంట్రోల్ ని పొందింది. ఇంకా సేఫ్టీ పరంగా చెప్పాలంటే, ఈ కారు స్టాండర్డ్ గా ఆరు ఎయిర్ బ్యాగ్స్, సెన్సార్లతో రియర్ పార్కింగ్ కెమెరా, ఐసోఫిక్స్, మరియు టిపిఎంఎస్ తో వచ్చే అవకాశం ఉంది.
ఆటోమేకర్ ఈ మోడల్ కి సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి వెల్లడించకపోయినా, సిట్రోన్ C3 ఎయిర్ క్రాస్ లో ఉపయోగించిన అదే ఇంజిన్ నే సిట్రోన్ బసాల్ట్ లో కూడా కొనసాగించనుంది. బానెట్ కింద, ఈ కారు 109bhp మరియు 205Nm టార్కును ఉత్పత్తి చేసే 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 6-స్పీడ్ మాన్యువల్ లేదా టార్క్ కన్వర్టర్ యూనిట్ తో జతచేయబడి వచ్చే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్