- పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉన్న కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్
- కేవలం సింగిల్ పవర్ ట్రెయిన్ తో మాత్రమే లభ్యం
తాజాగా స్కోడా ఇండియా దేశమంతటా కుషాక్ ఎస్యూవీ అయిన ఎలిగెన్స్ ఎడిషన్ ను రూ.18.31 లక్షలు(ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ చేసింది. పరిమిత సంఖ్యలో అందుబాటులోకి వచ్చిన ఈ ఎడిషన్ కుషాక్ లైనప్ లో టాప్ పొజిషన్ లో ఉంది. అలాగే ఇది కేవలం సింగిల్ పవర్ ట్రెయిన్ తో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది.
ఇండియాలోని టాప్-10 నగరాల్లో స్కోడా కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ వేరియంట్-వారీగా ఆన్-రోడ్ ధరలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:
నగరాలు | కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ఎంటి | కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ఎటి |
ఢిల్లీ | రూ. 21.32 లక్షలు | రూ. 22.69 లక్షలు |
ముంబై | రూ. 21.69 లక్షలు | రూ. 23.09 లక్షలు |
బెంగుళూరు | రూ. 22.57 లక్షలు | రూ. 24.03 లక్షలు |
పూణే | రూ. 21.69 లక్షలు | రూ. 23.09 లక్షలు |
హైదరాబాద్ | రూ. 22.56 లక్షలు | రూ. 24.02 లక్షలు |
అహ్మదాబాద్ | రూ. 20.18 లక్షలు | రూ. 21.48 లక్షలు |
లక్నో | రూ. 21.26 లక్షలు | రూ. 22.63 లక్షలు |
ఇండోర్ | రూ. 21.26 లక్షలు | రూ. 22.63 లక్షలు |
పాట్నా | రూ. 21.81 లక్షలు | రూ. 23.22 లక్షలు |
చెన్నై | రూ. 22.76 లక్షలు | రూ. 24.23 లక్షలు |
స్కోడా కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ లోని 1.5-లీటర్ టిఎస్ఐ గ్యాసోలిన్ ఇంజిన్ 148bhp మరియు 250Nm పీక్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా, ఇందులోని మోటారు 6-స్పీడ్ మాన్యువల్ మరియు డిఎస్జి గేర్ బాక్స్ ద్వారా ఫ్రంట్ వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్