- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని పొందే అవకాశం
- భారీ ఫీచర్ అప్ డేట్లతో వస్తుందని అంచనా
మొత్తానికి ఈ సంవత్సరం చివరి నాటికి హోండా అమేజ్ గుడ్ న్యూస్ తో మన ముందుకు రానుంది. నిజం చెప్పాలంటే, హోండా కంపెనీ న్యూ-జనరేషన్ టైప్ ని తీసుకువస్తుందని అంచనా వేస్తుండగా, ఇదే కారు మొదటిసారిగా టెస్టింగ్ చేస్తూ కనిపించింది. వీటి ఫోటోలను చూస్తే, కాంపాక్ట్ సెడాన్ ని కొనసాగిస్తుందని, సిటీ మోడల్ లాగా పూర్తి మార్పులతో కాకుండా మరింత కొత్తగా వచ్చే అవకాశం ఉంది.
ఫోటోలలో చూస్తే, టెయిల్ ల్యాంప్స్ కొత్త డిజైన్ తో వస్తాయని సూచనలు కనిపిస్తున్నాయి. అదే విధంగా, ప్రస్తుత జనరేషన్ కారుతో పోలిస్తే, ఒకే రకమైన డిజైన్ అంశాలతో రానుంది. ఇంటీరియర్ పరంగా, ఇందులోని లోపలి భాగంలో భారీ మార్పు మాత్రం పక్కాగా ఉంటుందని భావిస్తున్నాం. 360-డిగ్రీ కెమెరా, లెవెల్-2 ఎడాస్ (ఏడీఏఎస్), డ్యూయల్-డిజిటల్ స్క్రీన్స్, పవర్డ్ సీట్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, మరియు సన్ రూఫ్ వంటి ఫీచర్లను హోండా ఈ కారులో అప్ గ్రేడ్ చేసి అందించే అవకాశం ఉంది.
ఇంకా ఇంజిన్ విషయానికి వస్తే, ఈ కారు 89bhp మరియు110Nm టార్కును ఉత్పత్తి చేసే హోండా 1.2-లీటర్ ఇంజిన్ తో వస్తుందని భావిస్తుండగా, ఈ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి గేర్ బాక్సుతో జతచేయబడి రానుంది. కేవలం ఫీచర్లను మాత్రమే అప్ గ్రేడ్ చేయకుండా, హోండా కంపెనీ ఇందులో సిఎన్‍జి ఆప్షన్ ని కూడా అందించనుంది. వారి లెవెల్ లో దీని డీలర్లు సిఎన్‍జి ఫిట్మెంట్ ని ప్రస్తుతం అందిస్తుండగా, మారుతి మరియు హ్యుందాయ్ తో కొనసాగుతున్న పోటీలో సమంగా నిలవాలంటే ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ ఆప్షన్ ని అందిస్తే బాగుంటుంది.
అమేజ్ కేవలం అప్ కమింగ్ డిజైర్ తో మరియు ఆరాతో పోటీ పడుతుండగా, ఇక దీనిని తీసుకువస్తే హోండా పోటీలో ముందుంటుంది. అలాగే ఇది ఇతర విషయాలలో మారుతి బాలెనో, టయోటా గ్లాంజా, మరియు హ్యుందాయ్ i20 వంటి కార్లతో పోటీని ఎదుర్కొంటుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్