- ఇది వరకే ఇండియాలో టెస్టింగ్ చేస్తూ కనిపించిన 2024 స్విఫ్ట్ మోడల్
- లాంచ్ అయ్యే సమయానికి కొత్త హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ తో వచ్చే అవకాశం
చివరి నెలలో, సుజుకి 4వ జనరేషన్ స్విఫ్ట్ ని టోక్యోలో జరిగిన 2023 జపనీస్ మొబిలిటీ షోలో ఆవిష్కరించింది. ఈ మధ్యనే మారుతి 2024 మోడల్ స్విఫ్ట్ ను ఇండియాలో టెస్టింగ్ చేయడం ప్రారంభించగా, ఇప్పుడు మేము ఈ మోడల్ మైలేజీకి సంబంధించి పూర్తి వివరాలను కలిగి ఉన్నాము.
2024 మోడల్ మారుతి స్విఫ్ట్ కొత్త పవర్డ్ 1.2-లీటర్, 3 సిలిండర్, Z12E ఇంజిన్ తో రానుందని తెలుపగా, ఈ మోడల్ కి సంబంధించి అవుట్ పుట్ వివరాలు ఇంకా వెల్లడించలేదు, కానీ 100bhp మరియు 150Nm టార్కు రేంజ్ తో రావచ్చని భావిస్తున్నాం. ఈ వెర్షన్ ఎక్స్‌క్లూజివ్‌గా సివిటి యూనిట్ తో జత చేయబడింది. అలాగే, హైబ్రిడ్ వెర్షన్ లో కూడా రానుంది.
కొత్త మారుతి స్విఫ్ట్ లోని నాన్ హైబ్రిడ్ మరియు హైబ్రిడ్ వెర్షన్స్ వరుసగా 23.40 కెఎంపిఎల్ మరియు 24.50 కెఎంపిఎల్ క్లెయిమ్డ్ మైలేజ్ ను ఇవ్వనున్నాయి. ప్రస్తుతం ఇండియాలో విక్రయించబడుతున్న ఇండియా-స్పెక్ స్విఫ్ట్ 1.2-లీటర్, 4-సిలిండర్, డ్యూయల్ జెట్ పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఎఎంటివేరియంట్స్ వరుసగా 22.38 కెఎంపిఎల్మరియు 22.56కెఎంపిఎల్మైలేజీని అందిస్తున్నాయి. స్విఫ్ట్ ఇటరేషన్ నుంచి రాబోయే డిజైర్ సబ్-ఫోర్-మీటర్ సెడాన్‌కి సంబంధించిన అన్నీ అప్‌డేట్స్ అందిస్తున్నాము, వీటిని మీరు మా వెబ్‌సైట్‌ను సందర్శించి చదువుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్