- మరికొన్ని వారాల్లో లాంచ్ కానున్న 2024ఎక్స్‌యూవీ400
- రెండు కొత్త వేరియంట్లలో వచ్చే అవకాశం
మహీంద్రా తన ఎక్స్‌యూవీ400 ఈవీ లైనప్ లోకి రెండు కొత్త వేరియంట్లను పరిచయం చేయనుంది. అరంగేట్రానికి ముందు, ఈ మోడల్ మరోసారి కనిపించగా, దీని ద్వారా కీలకమైన వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల ప్రారంభంలో ఈ అప్‍డేటెడ్ మోడల్ డీలర్ షిప్ వద్ద కనిపించింది.
ఇక్కడ ఉన్న ఫోటోలలో చూస్తే, ఈ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు కాపర్ రూఫ్ తో వైట్ డ్యూయల్-టోన్ థీమ్ ఫినిష్ తో ఉంది. ఇంకా చెప్పాలంటే, అన్నీ పిల్లర్లు బ్లాక్డ్-అవుట్ ఎఫెక్ట్ తో ఉన్నాయి. ఎక్స్‌టీరియర్ పరంగా ఇక్కడ మనం గమనించాల్సిన అప్‍డేట్స్ ఏంటి అంటే, ఇందులో షార్క్-ఫిన్ యాంటెన్నా, కారు వెనుక వైపు ఈవీ బ్యాడ్జింగ్, మరియు ఫ్రంట్ ఫాగ్ లైట్స్ ఉన్నాయి. అదే విధంగా ఇది ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, బ్లాక్ రూఫ్ రెయిల్స్ మరియు ఓఆర్‌విఎం, ఎల్ఈడీ టెయిల్ లైట్స్, మరియు రియర్ వైపర్ మరియు వాషర్ వంటి అప్‍డేట్స్ ని పొందుతుంది.
రీఫ్రెష్డ్ ఎక్స్‌యూవీ400 యొక్క డ్యాష్ బోర్డ్ భారీగా కవర్ తో కప్పబడి ఉండగా, కొంత వరకు కనిపించిన వాటిలో కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్, ఫ్రీ స్టాండింగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టం, రియర్ ఏసీ వెంట్స్, ఫ్రంట్ ఆర్మ్ రెస్ట్ వెనుక ఛార్జింగ్ పోర్ట్, మరియు డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ ఉన్నాయి. అలాగే ఇందులో క్రూయిజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం, వైర్ లెస్ ఛార్జర్, వైర్ లెస్ ఫోన్ కనెక్టివిటీ, మరియు 10.25-ఇంచ్ ఫుల్లీ డిజిటల్ ఇంస్ట్రుమెంట్ క్లస్టర్ ఉండనున్నాయి.
ఈ మహీంద్రా ఈవీ ప్రస్తుతం 34.5kWh మరియు 39.4kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. ఈ యూనిట్లు, అలాగే ఎలక్ట్రిక్ మోటార్ అవుట్ పుట్ పరంగా ఎలాంటి మార్పులు లేకుండా వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ400 మోడల్ 290 కిలోమీటర్ల వరకు క్లెయిమ్డ్ మైలేజీని అందించనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్