- వచ్చే నెలలో అరంగేట్రం చేయనున్న స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్
- ఈసంవత్సరం తరువాత లాంచ్ అవ్వనున్న కొత్త డిజైర్
త్వరలో మారుతి సుజుకి డిజైర్ ఈ సంవత్సరానికి సంబంధించి ముఖ్యమైన జనరేషనల్ అప్‍డేట్ ని అందుకోనుంది. రాబోయే (అప్‍కమింగ్) స్విఫ్ట్ లాగానే, కాంపాక్ట్ సెడాన్ కొత్త ఎక్స్‌టీరియర్ స్టైలింగ్ మరియు అప్‌గ్రేడ్ క్యాబిన్‌తో ఫోర్త్-జనరేషన్ అప్‍డేట్ ని పొందనుంది. ఇప్పుడు, ఈ కొత్త వెర్షన్ ద్వారా, మారుతి డిజైర్ స్విఫ్ట్ కంటే పెద్ద బూట్ స్పేస్‌ని అందించడమే కాకుండా మరిన్ని ఫీచర్లను జతచేయనుంది.
కొత్త స్విఫ్ట్‌తో పోలిస్తే కొత్త మారుతి డిజైర్ మరిన్ని కొత్త ఫీచర్లు మరియు టెక్ ఫీచర్లతో రానుంది. తాజాగా మేము స్పై ఫోటోలలో చూస్తే, హోండా అమేజ్ కి పోటీగా ఉన్న ఈ మోడల్ 360-డిగ్రీ సరౌండ్ కెమెరా మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సింగిల్-పేన్ సన్‌రూఫ్‌తో అమర్చబడి ఉంది. ఈ రెండు ఫీచర్‌లు దీనికి పోటీగా ఉన్న మోడల్ లో లేకపోవడంతో ప్రస్తుతం ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ ఫీచర్లతో దీనిని మారుతి విక్రయించనుంది.
ఇంకా, సెడాన్ స్పై ఫోటోలను చూస్తే డిఫరెంట్ స్టైలింగ్ తో వస్తున్నట్లు నిర్దారణ అయింది. స్పోర్ట్ లుక్ లో కనిపించే గ్రిల్ తో ఫ్రంట్ ఫాసియా, రీడిజైన్డ్ బంపర్, రీపొజిషన్డ్ ఫాగ్ ల్యాంప్స్ మరియు స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. అలాగే, డిజైర్ ఫేస్‌లిఫ్ట్ దాని హ్యాచ్‌బ్యాక్ కౌంటర్‌పార్ట్‌తో పోలిస్తే రీడిజైన్డ్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుందని మేము భావిస్తున్నాము.
మెకానికల్ గా, డిజైర్ కొత్త Z-సిరీస్ 1.2-లీటర్ ఎన్ఎపెట్రోల్ ఇంజన్‌తో రావచ్చని భావిస్తున్నాము. ఈ మోటార్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి యూనిట్‌తో జతచేయబడనుంది. సెలెక్టెడ్ వేరియంట్‌లలో ఫ్యాక్టరీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ ఆప్షన్ కూడా ఇందులో అందించబడనుంది. న్యూ జెన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ మార్కెట్లో అడుగుపెట్టిన తర్వాత ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అప్‌డేటెడ్ డిజైర్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్