- కొత్త టాప్స్-స్పెక్ వెర్షన్ గా అందించబడిన 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ రేంజ్
- 188bhp/400Nm టార్కును ఉత్పత్తి చేస్తున్న లగ్జరీ కారులోని 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్
బిఎండబ్లూ 3 సిరీస్ డీజిల్ లైనప్ లో, కొత్త వేరియంట్ ని లాంచ్ చేయగా, దీని ఎక్స్-షోరూం ధరలు రూ.65 లక్షల నుంచి ప్రారంభమయ్యాయి. దీనిని 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ గా పిలుస్తుండగా, కొత్తగా వచ్చిన ఈ మోడల్ బుకింగ్స్ నేడే ప్రారంభంకాగా, వీటి డెలివరీ త్వరలోనే ప్రారంభంకానుంది.
కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ డిజైన్ హైలైట్లలో బ్లాక్డ్-అవుట్ కిడ్నీ గ్రిల్, అడాప్టివ్ ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, గ్లోసీ బ్లాక్ రియర్ డిఫ్యూజర్, డార్క్ షాడో మెటాలిక్ ఫినిష్ తో ఫ్రంట్ బంపర్, ఎం-స్పెసిఫిక్ ఇన్సర్ట్స్ తో కార్ కీ, కారు ముందు మరియు వెనుక భాగాన ఎం డోర్ సిల్ ఫినిషర్స్, మరియు ఎం-స్పెసిఫిక్ ఏరో ప్యాకేజీ వంటివి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. కస్టమర్లు దీనిని మినరల్ వైట్, స్కై స్క్రాపర్ గ్రే, కార్బన్ బ్లాక్, మరియు పొర్టిమావో బ్లూ వంటి నాలుగు కలర్ ఆప్షన్ల నుంచి నచ్చిన కలర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
2024 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ ఎం స్పోర్ట్ ప్రో ఎడిషన్ ఇంటీరియర్ ని పరిశీలిస్తే, ఈ కారు లోపల ఎం-స్పెసిఫిక్ అంత్రటిస్ హెడ్ లైనర్ అప్హోల్స్టరీ, వంపులు తిరిగి ఉన్న డిస్ ప్లే, బిఎండబ్లూ 8.5 ఆపరేటింగ్ సిస్టం, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్స్, వైర్ లెస్ ఛార్జింగ్, పార్క్ అసిస్టెంట్ ప్లస్, పనోరమిక్ సన్ రూఫ్, యాంబియంట్ లైటింగ్, త్రీ-జోన్ క్లైమేట్ కంట్రోల్, మరియు 6 ఎయిర్ బ్యాగ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యమైన అంశం ఏంటి అంటే, ఈ వేరియంట్ ధర 320Ld ఎం స్పోర్ట్ కంటే కేవలం రూ.3 లక్షలు ఎక్కువ ప్రీమియం ధరను కలిగి ఉంది.
బానెట్ కింద అందించబడిన ఇంజిన్ల విషయానికి వస్తే, ఈ లగ్జరీ కారు ఇంజిన్లో ఎలాంటి మార్పులు లేకుండా వచ్చింది. కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ వేరియంట్ ఇంతకు ముందులాగే 2.0-లీటర్, ఫోర్-సిలిండర్ డీజిల్ ఇంజిన్ తో కొనసాగుతుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సుతో జతచేయబడి వీల్స్ కి పవర్ ని సప్లై చేస్తూ 188bhp మరియు 400Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. అదనంగా, ఈ లగ్జరీ కారు 255bhp మరియు 400Nm టార్కును ఉత్పత్తి చేసే 2.0-లీటర్, ఫోర్-సిలిండర్, టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో కూడా అందుబాటులో ఉంది.