- మొదటి స్పెషల్ ఎడిషన్ గా నిలిచిన హెక్టర్ ఎస్యూవీ
- పెట్రోల్ మరియు డీజిల్ పవర్ లలో లభ్యం
లాంచ్ అయిన బ్లాక్‌స్టార్మ్
ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఇండియాలో రూ.21.24 లక్షలు (ఎక్స్-షోరూం) ప్రారంభ ధరతో లాంచ్ అయింది. ఇది టాప్-స్పెక్ షార్ప్ ప్రో వేరియంట్లపై ఆధారంగా రాగా, దీనిని పెట్రోల్ మరియు డీజిల్ పవర్ రెండింటిలో పొందవచ్చు.
ఆస్టర్ బ్లాక్‌స్టార్మ్ మరియు గ్లోస్టర్ బ్లాక్‌స్టార్మ్ కార్ల లాగానే, ఇది కూడా బంపర్స్ మరియు రెడ్ బ్రేక్ కాలిపర్లపై రెడ్ యాక్సెంట్స్ తో ఆల్-బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ ని పొందింది. ఇంటీరియర్ పరంగా లోపల చూస్తే, ఎంజి కంపెనీ దీని క్యాబిన్ ని సంగ్రియా మరియు బ్లాక్ థీమ్ తో అందించడమే కాకుండా 14-ఇంచ్ పోర్ట్రెయిట్-స్టైల్ టచ్‌స్క్రీన్ సిస్టమ్, రియర్ AC వెంట్లతో క్లైమేట్ కంట్రోల్, పవర్ డ్రైవర్ సీటు, లెవెల్-2 ఏడీఏఎస్ (ఎడాస్), డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఫుల్ ఎల్ఈడీ లైట్ ప్యాకేజీ వంటి ఫీచర్లను అందించింది.
హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఇంజిన్ ఆప్షన్లు
ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ కారును ఎంజి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ లేదా 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్లతో పొందవచ్చు. పెట్రోల్ మోటార్ 141bhp/250Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ మాన్యువల్ లేదా సివిటి యూనిట్ తో జతచేసి పొందవచ్చు. అలాగే, డీజిల్ మోటార్ 168bhp/350Nm టార్కును ఉత్పత్తి చేస్తుండగా, దీనిని 6-స్పీడ్ ఎంటితో జత చేసి పొందవచ్చు.
హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ధర మరియు కాంపీటీషన్
ఈ కారు ఆటో మార్కెట్లో ఇదే ఫార్ములాను అనుసరించి స్పెషల్ ఎస్‌యూవీలను అందించే భారీ లిస్టులో చేరిపోయింది. ఇది ఫుల్లీ లోడెడ్ మోడల్ గా అందించబడుతుండగా మార్కెట్లో నిలదొక్కుకునేందుకు స్పెషల్ పెయింట్ స్కీమ్‌ని కూడా జత చేసింది. ఇక ఇతర కార్లతో పోటీ విషయానికి వస్తే, హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్ కారు కియా సెల్టోస్ X-లైన్, హ్యుందాయ్ క్రెటా N లైన్, టాటా హారియర్ డార్క్, ఎంజిఆస్టర్ బ్లాక్‌స్టార్మ్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ జిటిలైన్ మరియు స్కోడా కుషాక్ మోంటే కార్లో వంటి కార్లతో పోటీపడుతుంది.
ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ ధరలు
పవర్ ట్రెయిన్ & సీట్ కాన్ఫిగరేషన్ | ధర (ఎక్స్-షోరూం) |
ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ సివిటి | రూ. 21.24 లక్షలు |
ఎంజి హెక్టర్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటి | రూ. 21.94 లక్షలు |
ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ సివిటి 7-సీటర్ | రూ. 21.97 లక్షలు |
ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటి 7-సీటర్ | రూ. 22.54 లక్షలు |
ఎంజి హెక్టర్ ప్లస్ బ్లాక్‌స్టార్మ్ డీజిల్ ఎంటి 6-సీటర్ | రూ. 22.75 లక్షలు |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్