పరిచయం
గత కొన్ని వారాల క్రితం, జపాన్ మొబిలిటీ షోలో కొత్త స్విఫ్ట్ ప్రపంచవ్యాప్తంగా అరంగేట్రం చేసింది. ఈ హ్యాచ్‌బ్యాక్ కొన్ని కీలకమైన ఎక్స్‌టీరియర్ అప్‌డేట్స్ తో పాటుగా, లేటెస్ట్ క్యాబిన్ మరియు కొత్తగా ట్వీక్డ్ పెట్రోల్ ఇంజన్ తో రానుంది. మేము కొత్తగా వచ్చిన స్విఫ్ట్ మరియు పాత స్విఫ్ట్ మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలను లిస్టులో పొందుపరిచాం. వీటిని మనం ఒకసారి పరిశీలిద్దాం.
ఎక్స్‌టీరియర్
ఇందులో మొత్తంగా చూస్తే ఎల్-షేప్డ్ ఇంటిగ్రేటెడ్ డీఆర్ఎల్స్ తో కూడిన కొత్త ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్ చాలా స్పష్టంగా కనిపిస్తుండగా, ఎక్స్‌టీరియర్ డిజైన్ మరియు స్టైలింగ్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా, బ్రాండ్ లోగో కొత్త స్కిడ్ ప్లేట్స్ పై రీప్రొఫైల్ చేయబడగా, ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ బానెట్‌పై రీపోజిషన్ చేయబడ్డాయి.
డిజైన్‌లో అతిపెద్ద మార్పు ఏమిటంటే సి-పిల్లర్ నుండి డోర్‌పైకి వెనుక హ్యాండిల్స్ ఉండనున్నాయి. టెయిల్ ల్యాంప్స్ కొత్తవి కనిపిస్తుండగా అలాగే స్మోక్డ్ క్లస్టర్స్ మరియు అల్లాయ్ వీల్స్ కోసం స్విర్ల్ ప్యాటర్న్ స్విఫ్ట్‌కి లేటెస్ట్ లుక్ ని అందించనున్నాయి.
ఇంటీరియర్
కొత్త స్విఫ్ట్ క్యాబిన్ ఇప్పుడు బాలెనోతో సమానంగా ఉండనుంది. ఫుల్ బ్లాక్ గా ఉన్న ఇంటీరియర్ కొత్త డ్యూయల్-టోన్ బ్లాక్ అండ్ వైట్ థీమ్ తో రానుండగా, ఈ కొత్తస్విఫ్ట్ అనలాగ్ డయల్స్‌తోనే అందించబడుతోంది. పెద్ద 9-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇప్పుడు డ్యాష్‌బోర్డ్‌పై అమర్చబడగా, ఎయిర్‌కాన్ ప్యానెల్ పై ఉన్న రోటరీ డయల్స్ ఇప్పుడు హారిజాంటల్ బటన్స్ తో మరియు సింగిల్ డిస్‌ప్లే స్క్రీన్‌తో భర్తీ చేయబడ్డాయి.
పవర్ ట్రెయిన్
న్యూ జెన్ స్విఫ్ట్ పవర్‌ట్రెయిన్ కొత్త Z-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో రావడం ఇందులో అతిపెద్ద మార్పు అని చెప్పవచ్చు. K12 1.2-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ 1.2-లీటర్ 3-సిలిండర్ మోటార్ స్థానంలో రానుంది. ప్రపంచవ్యాప్తంగా, దీని ఇంజిన్ సివిటి యూనిట్ మరియు ఏడబ్ల్యూడీ కాన్ఫిగరేషన్‌తో జత చేయబడి రానుంది. అయితే, ఇది వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు, ఇది మాన్యువల్ మరియు ఏఎంటీ యూనిట్‌తో అందించబడుతుందని మేము భావిస్తున్నాము.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్