- మొత్తంగా విక్రయించినవి 1,64,439 యూనిట్స్
- 1.3 శాతం పెరిగిన డొమెస్టిక్ కార్ సేల్స్ వార్షిక వృద్ధి రేటు
మారుతి సుజుకి నవంబరు-2023కి సంబంధించిన సేల్స్ రిపోర్టును వెల్లడించింది. ఈ ఆటోమేకర్ గత నెలలో మొత్తం 1,64,439 యూనిట్స్ విక్రయించింది. ఇందులో 1,36,667 యూనిట్స్ డొమెస్టిక్ సేల్స్ మరియు 22,950 యూనిట్స్ ఎగుమతులు ఉన్నాయి, అలాగే ఒరిజినల్ ఎక్విప్ మెంట్ మానుఫాక్చరర్ యూనిట్స్ ఉన్నాయి.
గత నెలలో, మారుతి సుజుకి కంపెనీ మొత్తం 74,916 యూనిట్స్ ఆల్టో, ఎస్-ప్రెస్సో, బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, వ్యాగన్ ఆర్ మరియు సియాజ్ కార్లు ఉన్నాయి. అదే విధంగా 59,242 యూనిట్స్ బ్రెజ్జా, ఎర్టిగా, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, ఇన్విక్టో, జిమ్నీ, ఎస్-క్రాస్, XL6 మరియు ఈకోల కార్లను విక్రయించింది.
ఇతర వార్తలలో చూస్తే, సుజుకి మోటార్ ప్రైవేటు లిమిటెడ్ దేశంలో 30 లక్షల యూనిట్స్ ప్రొడక్షన్ మైల్ స్టోన్ ని అధిగమించింది. ఆర్గనైజేషన్ ఈ ఆపరేషన్ ను ఫిబ్రవరి-2017లో మొదలుపెట్టగా సరిగ్గా 6 సంవత్సరాల 11 నెలలకు ఈ ఫీట్ ను సాధించింది. ప్రస్తుతం, ఈ సౌకర్యంతో ఆర్గనైజేషన్ బాలెనో, స్విఫ్ట్, డిజైర్, ఫ్రాంక్స్ మరియు టూర్ ఎస్ వంటి కార్లను తయారు చేస్తుంది మరియు సంవత్సరంలో ప్రొడక్షన్ కెపాసిటీ 7.5 లక్షల యూనిట్స్ గా ఉంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్