- ఇగ్నిస్ కారులోని అన్ని వేరియంట్లలో లభ్యం
- లాంచ్ అయినప్పటి నుంచి 2.8 లక్షలకు పైగా ఇగ్నిస్ కార్ల విక్రయం
మారుతి సుజుకి కంపెనీ కొత్త యాక్సెసరీలతో ఇగ్నిస్ మోడల్ లో రేడియన్స్ ఎడిషన్ ని లాంచ్ చేసింది. ఈ కొత్త ఎడిషన్ ఇగ్నిస్ కారులోని అన్ని వేరియంట్లలో అందుబాటులోకి రాగా, ఇందులోని ఎంట్రీ-లెవెల్ సిగ్మా వేరియంట్ రేడియన్స్ ఎడిషన్ ని రూ. 5.49 లక్షల ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు.
మారుతి సుజుకి ఇగ్నిస్ రేడియన్స్ ఎడిషన్ ద్వారా ఈ హ్యచ్ బ్యాక్ కి కాస్మోటిక్ అప్ గ్రేడ్లను తీసుకువచ్చింది. ఇందులోని మార్పుల విషయానికి వస్తే, మార్పులలో వీల్ కవర్స్, డోర్ వైజర్స్, మరియు కారులోని వివిధ ఏరియాలలో క్రోమ్ గార్నిష్ ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మనం చర్చించాల్సిన అంశం ఏమైనా ఉంది అంటే, అది దీని ధర. ఎందుకంటే రేడియన్స్ ఎడిషన్ అతి తక్కువ ధరతో అందుబాటులోకి వచ్చింది. అదే విధంగా ఇందులోని సిగ్మా వేరియంట్ ధర 5.84 లక్షలు ఉండగా, రేడియన్స్ ఎడిషన్ ధర దీని కంటే రూ. 35,000 తక్కువగా ఉంది. అలాగే, మొదటి దానితో పోలిస్తే రేడియన్స్ ఎడిషన్ కారులో అదనపు యాక్సెసరీలు అందించబడ్డాయి.
బానెట్ కింద, ఇగ్నిస్ కారులోని 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఎఎంటి గేర్ బాక్సులతో జతచేయబడి అందించబడింది. ఈ ఇంజిన్ 82bhp మరియు 113Nm టార్కును ఉత్పత్తి చేసే విధంగా ట్యూన్ చేయబడింది. ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మారుతి సుజుకి కంపెనీ 2017లో మొదటిసారిగా ఇగ్నిస్ కారును అందుబాటులోకి తీసుకువచ్చింది. లాంచ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మారుతి సుజుకి 2.8 లక్షలకు పైగా ఇగ్నిస్ కార్లను విక్రయించింది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్