- ఇండియాలో రూ. 5.36 లక్షలు నుండి ధరలు ప్రారంభం
- నవంబర్ 2021లో ప్రారంభమైన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్
మారుతి సుజుకి సెలెరియోను 2014లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు 7 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించడం ద్వారా కొత్త గుర్తింపును పొందింది. ఎంట్రీ-లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెకండ్ జనరేషన్ లో దీని ప్రస్తుత ప్రారంభ ధర రూ. 5.36 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
సెలెరియో హ్యాచ్‌బ్యాక్ LXi, VXi, ZXi మరియు ZXi ప్లస్ అనే 4 వేరియంట్స్ లో పొందవచ్చు. మెకానికల్‍గా,ఇందులో ఉన్న 1.0-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు ఏఎంటి గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ మోటార్ బిఎస్6 ఫేజ్ 2.0-కంప్లైంట్ కు అనుగుణంగా అలాగే 66bhp మరియు 89Nm మాక్సిమమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. కస్టమర్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో కూడిన సెలెరియో లో సిఎన్‍జి వెర్షన్ ఆప్షన్ లో కూడా పొందవచ్చు.
ఇంతకు ముందు విషయాలు చూస్తే, ఏ-స్టార్ మరియు రిట్జ్‌లకు సెలెరియో ఒక ప్రత్యామ్నాయం లేదా రీప్లేస్ మెంట్ గా చెప్పవచ్చు . 1.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో ప్రారంభించబడిన తరువాత 800cc డీజిల్ మోటార్ ను కూడా తీసుకువచ్చింది. తర్వాత భారతదేశంలో ఈ బ్రాండ్ లో చోటు చేసుకున్న మార్పుల కారణంగా పెట్రోల్- కార్లను వాడుకలో ఉన్నాయి. 2021లో, ఈ ఇండియన్ ఆటోమేకర్ సెకండ్ జనరేషన్ సెలెరియోను దేశంలో లాంచ్ చేసింది.