ఇండియాలో రూ. 7.46 లక్షలతో ప్రారంభంకానున్న ఫ్రాంక్స్ ధరలు
నెక్సా షోరూమ్‌ల ద్వారా ప్రత్యేకంగా విక్రయించబడుతున్న మారుతి ఫ్రాంక్స్
సెలెక్ట్ చేసిన మారుతి సుజుకి డీలర్లు ఈ నెలలో కొన్ని మోడళ్లపై డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఎరీనా మరియు నెక్సా డీలర్‌షిప్‌లలో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు మరియు కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో ఈ బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి.
మారుతి ఫ్రాంక్స్ పై ప్రస్తుతం రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ మరియు రూ. 5,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్ అందించబడుతోంది. ఈ బెనిఫిట్స్ బాలెనో-బేస్డ్ కూపే ఎస్‌యువిలోని టర్బో వేరియంట్లకు మాత్రమే వర్తిస్తుందని మీరు గమనించాల్సి ఉంది.
మారుతి సుజుకి ఫ్రాంక్స్ పవర్డ్ 1.2-లీటర్, నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ లేదా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్‌తో వచ్చింది అంతేకాకుండా ఇది సిఎన్జి వెర్షన్ లో కూడా అందుబాటులో ఉంది. కస్టమరలు దీనిని సిగ్మా, డెల్టా, డెల్టా+, జీటా మరియు ఆల్ఫాఅనే 5 వేరియంట్ల నుండి ఎంచుకోవచ్చు. అంతేకాకుండా, కలర్స్ పరంగా ఇది 7 మోనోటోన్ మరియు 3 డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది.
అనువాదించిన వారు: రాజపుష్ప