- ఇండియాలో రూ. 9.29 లక్షలతో ప్రారంభమైన బ్రెజా సిఎన్‍జి ధరలు
- ప్రస్తుతం అందుబాటులో ఉన్న 3వేరియంట్స్
మారుతి సుజుకి బ్రెజా లో సేఫ్టీ ఫీచర్లను మరింత మెరుగుపరుస్తూ వీటిని తక్షణం అమలులోకి తీసుకువచ్చింది. ఆటోమేకర్ సిఎన్‍జి రేంజ్ లోని అన్ని వేరియంట్లలో రెండు కొత్త సేఫ్టీ ఫీచర్స్ లను అమర్చింది. వాటిని వేరియంట్ లైనప్‌లో స్టాండర్డ్ గా అందుబాటులోకి తీసుకొచ్చింది.
మారుతి బ్రెజా సిఎన్‍జి వేరియంట్‌లైన LXi, VXi మరియు ZXi మోడల్స్ ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ఈ ఎస్ పీ) ఫీచర్ ని అలాగే, మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ ను కూడా పొందాయి. ఈ రెండు ఫీచర్లు గతంలో పెట్రోల్ వెర్షన్ లో మాత్రమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ, ఇప్పుడు బ్రెజాసిఎన్‍జి వేరియంట్ లో కూడా వీటిని పొందవచ్చు. అలాగే ముఖ్యంగా, బ్రెజా సిఎన్‍జి వేరియంట్ ధరల్లో ఎటువంటి మార్పులు లేవు.
మారుతి బ్రెజాలోని 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ 102bhp మరియు 137Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. సిఎన్‍జి మోడ్‌లో, అవుట్‌పుట్ గా 87bhp మరియు 121Nmటార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ స్టాండర్డ్ గా రాగా, అయితే 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ యూనిట్ పెట్రోల్ వెర్షన్‌కి మాత్రమే పరిమితం చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప