- రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్ లేఅవుట్ తో రానున్న ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్
- ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫీచర్ ను పొందనున్న ఫేస్‍లిఫ్ట్
ఇండియన్ ఆటో దిగ్గజం మహీంద్రా వచ్చే సంవత్సరం 2024లో ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్, ఎక్స్‌యూవీ400 ఫేస్‍లిఫ్ట్, మరియు 5-డోర్ థార్ వంటి వివిధ మోడళ్ళను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్టెడ్ వెర్షన్ ను టెస్ట్ మ్యూల్ తో టెస్టింగ్ చేస్తూ ఉండగా స్పై కెమెరా కంటికి చిక్కింది.
తాజా స్పై ఫోటోలలో రాబోయే ఎస్‍యూవీ యొక్క ఇంటీరియర్ లో ఏమేం ఉండనున్నాయో ఇక్కడ మనం చూడవచ్చు. అయితే, ఈ కొత్త స్పై షాట్స్ లో ఎస్‍యూవీకి సంబంధించిన క్యాబిన్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ తాజా స్పై పిక్చర్ ని గమనిస్తే, వైట్ సీట్ అప్ హోల్స్టరీ డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్ తో రానుంది. ఇంకా ఇందులో గమనించాల్సిన మిగతా అంశాలు ఏంటి అంటే, రీడిజైన్డ్ సెంటర్ కన్సోల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటో-డిమ్మింగ్ ఐఆర్ వి ఎం, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ మరియు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఫంక్షన్ వంటి అద్బుతమైన ఫీచర్స్ ఉన్నాయి.
ఇక ఎక్స్‌టీరియర్ విషయానికి వస్తే, అప్‍డేటెడ్ ఎక్స్‌యూవీ300 కొత్త ఫ్రంట్ మరియు రియర్ ప్రొఫైల్ ని పొందనుంది. దీంతో దీని లుక్ మరింత తాజాగా కనిపించనుంది. అలాగే ఇందులో కొత్త స్ప్లిట్ ఎల్ఈడీహెడ్‌ల్యాంప్స్, ఎక్స్‌యూవీ700-ఉన్నటువంటి ఎల్ఈడీడీఆర్ఎల్స్, స్లీకర్ గ్రిల్, కొత్త ప్యాటర్న్ తో కూడిన అల్లాయ్ వీల్స్, రీడిజైన్డ్ కొత్త ఫ్రంట్ మరియు రియర్ బంపర్స్ మరియు కనెక్టెడ్ ఎల్ఈడీటెయిల్‌లైట్స్ ఉండనున్నాయి.
ఇక ఇందులో ప్రధానంగా ఉండే ఇంజిన్స్ విషయానికి వస్తే, రాబోయే ఎక్స్‌యూవీ300 ఫేస్‍లిఫ్ట్ ఇంతకు ముందున్న వెర్షన్ లాగా 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ తో రానుంది. చివరగా పోటీ విషయానికి వస్తే, ఎక్స్‌యూవీ300 టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మరియు కియా సోనెట్ వంటి వాటితో పోటీపడనుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్