మహీంద్రా తాజాగా దాని కొత్త కారు XUV 3XOని ఇండియాలో లాంచ్ చేసింది, ఇది దాని XUV300 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్. కంపెనీ ఈ కొత్త మోడల్‌లో అనేక కాస్మెటిక్ అప్‌డేట్లను చేసింది మరియు కొత్త ఫీచర్లను కూడా జత చేసింది. ఈ పాపులర్ XUV 3XO టాటా నెక్సాన్ తో పాటుగాకియా సోనెట్‌తో కూడా పోటీపడుతుంది.ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో, ఈ రెండింటి ఇంజిన్లు, మైలేజీ మరియు ధరల మధ్య తేడా ఏమిటో కూడా మనం తెలుసుకుందాం.
ఇంజిన్, మైలేజీ మరియు పెర్ఫార్మెన్స్
కియా ఇండియా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సోనెట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఈ సంవత్సరం ప్రారంభంలో లాంచ్ చేసింది. ఇది మూడు ఇంజిన్ ఆప్షన్లతో అందించబడుతుంది, అందులో 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్, 6-స్పీడ్ ఐఎంటిమరియు 7-స్పీడ్ డిసిటిగేర్‌బాక్స్‌లతో కాన్ఫిగర్ చేయబడ్డాయి. ఇది లీటర్‌కు 18.60 కి.మీ నుండి 22.30 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
మహీంద్రా XUV 3XOనిగత నెలలో లాంచ్ చేసింది. ఇందులో కూడా కంపెనీ మూడు ఇంజిన్ ఆప్షన్లను ఇచ్చింది. ఇందులో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 1.2-లీటర్ టిజిడిఐటర్బో-పెట్రోల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఎఎంటిమరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ యూనిట్‌లతో జత చేయబడ్డాయి. 3XO మోడల్ ఏఆర్ఏఐ ద్వారాక్లెయిమ్ చేసిన18.06 నుండి 21.2 కిమీ/లీ మైలేజీని అందిస్తుంది.
ఇప్పుడు రెండింటి యొక్క ఇంజన్ మరియు మైలేజీ గురించి మాట్లాడుకుంటే, రెండూ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్‌లతో సహా మూడు ఇంజిన్ ఆప్షన్లలో అందించబడ్డాయి. అలాగే, రెండు మోడళ్ల మైలేజీని పోల్చి చూస్తే, అవి దాదాపు సమానంగా ఉన్నాయి.
ధర
2024 XUV 3XO ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.49 లక్షలుగా ఉంది. ఇది MX1, MX2, MX2 ప్రో, MX3, MX3 ప్రో, AX5, AX5 లగ్జరీ, AX7 మరియు AX7 లగ్జరీ వంటి తొమ్మిది వేరియంట్‌లలో పరిచయం చేయబడింది.
మరోవైపు, కియా సోనెట్ ధర రూ. 7.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది. ఈ మోడల్ HTE, HTK, HTK+, HTX, HTX+, GTX+ మరియు X-లైన్ అనే ఏడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఒకసారి ధరలను పరిశీలిస్తే, కియా సోనెట్ తో పోలిస్తే మహీంద్రా XUV 3XO చాలా చవక ధరకు లభిస్తుంది.
ఫైనల్ రిపోర్ట్
ఈ రెండు కార్ల ఇంజన్ ఆప్షన్‌లు, మైలేజీ మరియు ధరల గురించి మేము పైన వివరించాము, ఈ సెగ్మెంట్‌లో ఈ రెండు కార్లలో ఏది కొనాలి అనే గందరగోళాన్ని తొలగించడంలో కస్టమర్లకు ఇది సహాయపడుతుందని మేము భావిస్తున్నాము. ఆయా ఇంజిన్ ఆప్షన్లు మరియు మైలేజీ గురించి చెప్పాలంటే, మహీంద్రా XUV 3XO మరియు కియా సోనెట్ ఇంజిన్లు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి, ఎందుకంటే రెండింటిలో మూడు ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి మరియు ఫ్యూయల్ ఎఫిషియన్సీ కూడా సమానంగా ఉంది.
ఫీచర్ల విషయానికొస్తే, XUV 3XO సోనెట్ కంటే తక్కువ ఫీచర్లను కలిగి ఉంది, కానీ మీరు బడ్జెట్ కారును కొనుగోలు చేయాలనుకుంటే, మహీంద్రా యొక్క XUV 3XO బెస్ట్ ఆప్షన్ గా నిరూపించబడింది.
మరో వార్తలో, మహీంద్రా XUV 3XO కోసం బుకింగ్స్ రెండు రోజుల క్రితం అంటే మే 15, 2024న ప్రారంభమయ్యాయి. కేవలం ఒక గంట వ్యవధిలో రికార్డు స్థాయిలో 50 వేల మంది ఈ మోడల్‌ను బుక్ చేసుకున్నారు మరియు దీని డెలివరీ ఈ నెల 26 నుండి ప్రారంభమవుతుంది.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్