- చివరిగా 35,000 యూనిట్ల ఓపెన్ బుకింగ్స్ రికార్డు చేసిన XUV700
- ప్రొడక్షన్ ని పెంచడానికి భారీ ప్లాన్ ని అమలు చేస్తున్న మహీంద్రా కంపెనీ
మహీంద్రా మే-2024కి చెందిన దాని ఓపెన్ బుకింగ్స్ కి సంబంధించి కీలక వివరాలను తాజాగా ప్రకటించింది. కార్ మేకర్ ఈ నెల వరకు దాదాపుగా 2.2 లక్షల యూనిట్ల XUV700 కార్లను డెలివరీ చేయాల్సి ఉంది. ముఖ్యంగా, XUV700 అత్యధికంగా బుకింగ్స్ ని కలిగి ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య గణనీయంగా పడిపోయింది.
ఫిబ్రవరి-2024 నాటికి, మహీంద్రా 35,000 యూనిట్ల XUV700 కార్ల బుకింగ్స్ ని కలిగి ఉంది. ఈ నంబర్స్ కాస్తా 16,000 యూనిట్లకు పడిపోయాయి, దీంతో బుకింగ్స్ 54 శాతం మేర క్షీణించాయి. దీని ఫలితంగా, మహీంద్రా కంపెనీ దాని మానుఫాక్చరింగ్ ఫ్యాక్టరీలో XUV700 ఎస్యూవీ ప్రొడక్షన్ ని పెంచాలని భావిస్తోంది.
అదే విధంగా, మహీంద్రా ప్రతినెలా 48,000 కొత్త బుకింగ్స్ ని అందుకుంటూ విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే, కస్టమర్లు ప్రతినెలా అందులోని దాదాపుగా 42,000 కార్లకు బిల్లింగ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే, ప్రతినెలా ఇందులోని 10 శాతం మేర బుకింగ్స్ క్యాన్సిలేషన్ కి గురవుతున్నాయి. ముఖ్యంగా, మహీంద్రా కంపెనీ నుంచి తాజాగా అందించబడిన XUV 3XO మోడల్ 50,000 యూనిట్ల బుకింగ్స్ తో సరికొత్త రికార్డును సాధించింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మా వెబ్ సైట్ ని సందర్శించి చదువగలరు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్