- రూ. 7.49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయిన XUV 3XO
- అందుబాటులో ఉన్న లెవల్ 2ఏడీఏఎస్(ఎడాస్) సూట్, 360-డిగ్రీ కెమెరా
మహీంద్రా ఇటీవల దేశవ్యాప్తంగా దాని ఎంట్రీ-లెవల్ ఎస్‌యువి, XUV 3XO ధరలను వెల్లడించింది. XUV300 అప్‌డేట్ వెర్షన్ ను రూ. 7.49 లక్షలు ఎక్స్-షోరూం ప్రారంభ ధరతో పొందవచ్చు. ఈ ధరతో, ఈ మోడల్ తో కాంపీటీషన్ లో ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజా మరియు కియా సోనెట్ ధరలతో పోలిస్తే ఈ మోడల్ ధర కనీసం రూ. 50,000 వరకు తక్కువ ఉంది. ఈ కథనంలో, XUV 3XO లో ఉన్న టెక్ ఫీచర్స్ వివరాలను మేము వివరిస్తాము, దానికి పోటీగా ఉన్న ఎస్‌యువిని కూడా మనం పరిశీలిద్దాం.
లెవల్ 2ఏడీఏఎస్(ఎడాస్) సూట్
ఏడీఏఎస్(ఎడాస్) టెక్ ఫీచర్స్ ఈ విభాగానికి కొత్తది కాదు, గతంలో హ్యుందాయ్ వెన్యూ మరియు కియా సోనెట్ ఈ రెండు మోడల్స్ లెవల్ 1 ఏడీఏఎస్(ఎడాస్) సూట్‌ను కలిగి ఉన్నాయి. అయితే,చాలా వరకు XUV700 నుండి టెక్ ఫీచర్స్ తీసుకోగా, XUV 3XOలోలెవల్ 2 ఎడాస్ (ఏడీఏఎస్) వంటి బెటర్ టెక్ ఫీచర్స్ ఉన్నాయి .XUV 3XO ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్)అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, హై బీమ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్ మరియు స్మార్ట్ పైలట్ అసిస్ట్ వంటి ఫీచర్లను అందిస్తుంది.
హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్
మహీంద్రా XUV 3XO మ్యూజిక్ సిస్టమ్ విభాగాన్ని చూస్తే ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా ఈ ఎస్‌యువి హార్మాన్ కార్డాన్ నుండి 7-స్పీకర్స్ మ్యూజిక్ సిస్టమ్ ని పొందింది. ఈ సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైయర్ మరియు సబ్-వూఫర్‌తో మాత్రమే అందుబాటులో ఉంది.
65W టైప్-C ఛార్జింగ్ పోర్ట్
ఇప్పుడు, ఈ రోజుల్లో టైప్-C ఛార్జర్ కామన్, కానీ XUV 3XOతో, 65W టైప్ C ఛార్జింగ్ పోర్ట్‌ని ఉపయోగించి, ల్యాప్‌టాప్ మరియు ఇతర హై-పవర్ సోర్సింగ్ గాడ్జెట్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.
డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్
మహీంద్రా XUV 3XO దాని క్లాస్ డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్‌తో వచ్చిన ఏకైక ఎస్‌యువి అని చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ కార్ తో పోటీపడుతున్న ఇతర మోడల్స్ లోని టాప్-స్పెక్ వేరియంట్లు మాత్రమే సింగిల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ని పొందుతాయి.
పనోరమిక్ సన్‌రూఫ్
AX7 వేరియంట్‌తో ప్రారంభిస్తే, XUV 3XO ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్ ను పొందుతుంది. అయితే, కస్టమర్లు MX2 ప్రో వేరియంట్‌తో ప్రారంభమయ్యే సింగిల్-పేన్ సన్‌రూఫ్ నుండి బెనిఫిట్స్ ను పొందుతారు.
ఆటో-హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్
చివరగా, దాని సెగ్మెంట్ ఫీచర్ లో మరొక మొదటిది ఆటో-హోల్డ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ను కూడా పొందవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప