- ఇండియాలోఈ ఏడాది చివర్లో 5-డోర్ థార్ ధరలు వెల్లడి
- లాంచ్ సమయానికి ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ తో వచ్చే అవకాశం
రాబోయే నెలల్లో జరగబోయే లాంచ్ కి ముందే, మహీంద్రా థార్ 5-డోర్ మరోసారి టెస్టింగ్ ను కొనసాగిస్తోంది. వెబ్‌లో పంచుకున్న ఇంటీరియర్ యొక్క న్యూ స్పై షాట్‌లు చూస్తే, ఈ ఎస్‌యువి కొత్త ఫీచర్‌తో వస్తున్నట్లు వెల్లడవుతుంది.
ఇక్కడ చిత్రాలలో చూసినట్లుగా, మహీంద్రా థార్ యొక్క 5-డోర్ మునుపటి అప్‌డేట్ కంటే మరింత మోడరన్ రూపంతో రానుందని అర్థం అవుతుంది. ఇందులో పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ లభిస్తుంది. ఈ యూనిట్ XUV400 మరియు XUV700తో సహాఒకే విధానం పోలి ఉండే అవకాశం ఉంది.
ఇక్కడ కనిపిస్తున్న వాటిలో మల్టీ ఫంక్షన్ బటన్‌లతో కూడిన లెదర్‌తో చుట్టబడిన స్టీరింగ్ వీల్, రూఫ్- రూఫ్-మౌంటెడ్ ఐఆర్‍విఎం, సర్క్యులర్ ఏసీ వెంట్‌లు మరియు డ్యాష్‌బోర్డ్ ప్యాసింజర్ వైపున గ్రాబ్ హ్యాండిల్ వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి.
న్యూ థార్ 5-డోర్ యొక్క మునుపటి స్పై షాట్‌లు చూస్తే, కొత్త హెడ్‌ల్యాంప్‌లు మరియుడిఆర్ఎల్ఎస్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, న్యూ డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ మరియు మరిన్ని కీలకమైన ఫీచర్లను పొందుతుందని అర్థం అవుతుంది. అంతేకాకుండా, ఇందులో 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేయబడి అందించబడుతుందని అంచనా.
అనువాదించిన వారు: రాజపుష్ప