- ఇండియాలో రూ. 15.40 లక్షలతో ప్రారంభమైన థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు
- అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
మహీంద్రా గత వారం థార్ యొక్క స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేసింది, ఇది రూ. 15.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది.థార్ ఎర్త్ ఎడిషన్‌గా పిలువబడే ఈ వెర్షన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న లోకల్ డీలర్షిప్స్ వద్దకు చేరుకుంది.
ఇక్కడ ఉన్న చిత్రాలలో చూసినట్లుగా, కొత్త థార్ ఎర్త్ ఎడిషన్ డెసర్ట్ ఫ్యూరీ శాటిన్ మ్యాట్ అనే స్పెషల్ కలర్ ను పొందింది. బి-పిల్లర్స్ పై ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జింగ్, చుట్టూ మాట్ బ్లాక్ బ్యాడ్జింగ్ మరియు డోర్లపై డూన్-ఇంస్పైర్డ్ డెకాల్స్ వంటి వాటితో స్టాండర్డ్ థార్ నుండి వేరుగా కనిపించేందుకు ఇది కొన్ని అదనపు అంశాలను పొందుతుంది.
లోపల భాగంలో, మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ లైట్ బీజ్ మరియు బ్లాక్ డ్యూయల్-టోన్ థీమ్, డార్క్ క్రోమ్ యాక్సెంట్స్, డోర్లపై థార్ బ్రాండింగ్, హెడ్రెస్ట్లపై డూన్ డిజైన్ మరియు సెలెక్ట్ చేసిన ఎలిమెంట్స్ కోసం డెసర్ట్ ఫ్యూరీ-థీమ్ ఇన్సర్ట్ల వంటి ఫీచర్లను పొందింది. ఈస్పెషల్ ఎడిషన్ యొక్క ప్రతి యూనిట్ కూడా ప్రత్యేకమైన విఐఎన్ ప్లేట్‌తో అలంకరించబడుతుంది.
థార్ యొక్క ఈ కొత్త ఇటరేషన్ ని కంఫర్ట్ కిట్, ఫ్లోర్ మ్యాట్స్ మరియు ఆర్మ్‌రెస్ట్స్ వంటి యాక్సెసరీస్ లతో కూడా ఎంచుకోవచ్చు. ఈవెర్షన్లో పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్ మారవు, కాబట్టి మీరు 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో జత చేసిన 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2-లీటర్ డీజిల్ ఇంజిన్ల నుండి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: రాజపుష్ప