- స్కార్పియో N సెలెక్టెడ్ వేరియంట్ల ధరలలో మార్పులు
- ఇప్పుడు రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల వరకు ఉన్న స్కార్పియో N రేంజ్ ధరలు
మహీంద్రా కంపెనీ ఇండియన్ మార్కెట్లో ప్రస్తుతం విక్రయించబడుతున్న దాని కార్ల ధరలను మరోసారి పెంచింది. పెరిగిన ధరలు కొన్ని కార్ల మోడల్స్ పై మాత్రమే వర్తించనున్నాయి. అందులో థార్, స్కార్పియో N, మరియు మహీంద్రా బొలెరో ఉన్నాయి. ఇప్పుడు, మనం ఈ ఆర్టికల్ ద్వారా స్కార్పియో N మోడల్ ధరలలో జరిగిన మార్పులను ఓసారి పరిశీలిద్దాం.
పెట్రోల్ మరియు డీజిల్ రకంలో విక్రయించబడుతున్న అన్నీ స్కార్పియో Z2 మరియు Z4 వెర్షన్లు, అదే విధంగా Z6 డీజిల్ వెర్షన్లపై ఒకే విధంగా రూ. 25,000 వరకు ధర పెరిగింది. అలాగే, Z8 2డబ్లూడీ వెర్షన్లు పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్లు ఒక్కోదానిపై రూ. 10,000 ధర పెరగడంతో ఇప్పుడు ఇవి మరింత ప్రియంగా మారాయి.
ఈ ధర పెంపుతో, ఎంట్రీ-లెవెల్ Z2 పెట్రోల్ ఎంటి 7 సీటర్ మహీంద్రా స్కార్పియో N ధర రూ.13.85 లక్షలు (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమై టాప్-ఎండ్ Z8L డీజిల్ ఎటి 4డబ్లూడీ 7 సీటర్ రూ. 24.54 లక్షలు (ఎక్స్-షోరూం) వరకు ఉంది. కస్టమర్లు దీనిని Z2, Z4, Z6, Z8, Z8S, మరియు Z8L అనే ఆరు వేరియంట్ల నుంచి ఎంచుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్