ఇండియాలోలాంచ్
మహీంద్రా వివిధ టీజర్‌లను లాంచ్ చేసిన తర్వాత అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2024 XUV 3XOని ఏప్రిల్ 29న ఇండియాలో లాంచ్ చేసింది. మారుతి బ్రెజా, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి ఫ్రాంక్స్ మరియు టయోటా టైజర్ –వంటి వాటికి పోటీగా ఉన్న XUV 3XOని కొనుగోలు చేసే ముందు మీరు తెలుసుకోవలసిన టాప్-5 అంశాలు ఈ ఆర్టికల్ లో ఉన్నాయి.
వేరియంట్ | డీజిల్ | 1.2 టర్బో | 1.2 టర్బో ఏటీ | 1.2 టిజిడిఐ | 1.2 టిజిడిఐ ఏటీ |
MX1 | రూ. 7.9 లక్షలు | ||||
MX2 | రూ. 9.99 లక్షలు | ||||
MX2 ప్రో | రూ. 10.39 లక్షలు | రూ. 8.99 లక్షలు | రూ. 9.99 లక్షలు | ||
MX3 | రూ. 10.89 లక్షలు | రూ. 9.49 లక్షలు | |||
MX3 ప్రో | రూ. 11.39 లక్షలు | రూ. 9.99 లక్షలు | |||
AX5 | రూ.12.09 లక్షలు | రూ. 10.69 లక్షలు | |||
AX5L | రూ. 11.99 లక్షలు | రూ. 13.49 లక్షలు | |||
AX7 | రూ. 13.69 లక్షలు | రూ. 12.49 లక్షలు | |||
AX7L | రూ.14.99 లక్షలు | రూ. 13.99 లక్షలు | రూ. 15.49 లక్షలు |
ధర (ఎక్స్-షోరూమ్)
మోస్ట్ బేసిక్ MX1 మాన్యువల్ వేరియంట్ రూ. 7.49 లక్షలు ప్రారంభ ధరతో అందుబాటులో ఉండగా, ఫుల్లీ లోడెడ్ AX7 లగ్జరీ 1.2 టిజిడిఐ వేరియంట్ ని రూ. 15.49 లక్షలు ధరతో పొందవచ్చు. ఈ రెండింట్లో చూస్తే, పెట్రోల్ విషయానికి వస్తే, మీరు ఎంచుకోవడానికి సరిసమానమైన మాన్యువల్ వెర్షన్ తో పోలిస్తే పెట్రోల్ ఎటి వేరియంట్ ధర రూ.1.50 లక్షలు అధికంగా ఉంది. డీజిల్ విషయానికొస్తే, దీని సమానమైన ఎంటి వేరియంట్‌తో పోలిస్తే డీజిల్ ఎటి వేరియంట్ ధర రూ.80,000 అధికంగా ఉంది.
ఇంకా చెప్పాలంటే, స్టాండర్డ్ టర్బో పెట్రోల్ వేరియంట్ ధర టిజిడిఐ పెట్రోల్ తో పోలిస్తే మరీ అంత ఎక్కువగా ఏం ఉండదు. అలాగే మీకు ఫుల్లీ లోడెడ్ టిజిడిఐ పెట్రోల్ వేరియంట్ కావాలంటే, దీనిని రూ. 15.49 లక్షలు ధరతో పొందవచ్చు. చివరగా, డీజిల్ రేంజ్ MX2 వేరియంట్ లెవెల్ ని రూ. 9.99 లక్షలు ధరతో పొందవచ్చు.
వేరియంట్స్
ఎంట్రీ-లెవల్ MX, AX, AX3, AX5 మరియు AX7 అనే 5 వేరియంట్స్ లో అందుబాటులో ఉంది. ఇది మరింత లగ్జరీ ప్యాక్ మరియు ప్రో వెర్షన్‌లుగా వర్గీకరించబడింది. మేము బిట్-బై-బిట్ వేరియంట్‌లను డీకోడ్ చేసాము, మరింత తెలుసుకోవడానికి మీరు దాన్ని చెక్ చేయవచ్చు. ఇంకా చెప్పాలంటే, ఈ కారులోని అన్ని వెర్షన్‌లు ప్రయాణికులందరికీ మూడు-పాయింట్ సీట్ బెల్ట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్, ఈఎస్ సి, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు మరియు ఈబీడీతో ఏబీఎస్ లను పొందుతాయి.
ఇంజిన్ ఆప్షన్స్
మెకానికల్‍గా, కాంపాక్ట్ ఎస్‌యువి దాని ముందున్న XUV300 వలె అదే పవర్‌ట్రెయిన్ ఆప్షన్ తో కొనసాగుతుంది. ఇది 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌ను పొందుతుంది. స్టాండర్డ్ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్ ని 109bhp/200Nm ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏటితో పొందవచ్చు. 1.2-లీటర్ జిడిఐ టర్బో పెట్రోల్ ఇంజిన్ ని 129bhp/230Nm ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏటితో పొందవచ్చు. చివరగా, 1.5-లీటర్ డీజిల్ 115bhp/300Nm ఉత్పత్తి చేయడానికి 6-స్పీడ్ ఎంటి/6-స్పీడ్ ఏఎంటితో పొందవచ్చు. అయితే, ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టర్బో-పెట్రోల్ 4.5 సెకన్లలో 0-60కెఎంపిహెచ్ వేగాన్ని అందుకోగలదు మరియు - 20.160కెఎంపిఎల్ ఏఆర్ఏఐ-క్లెయిమ్డ్ మైలేజీని అందిస్తుంది.
మోడరన్ ఫీచర్స్
ఈ కార్ మోస్ట్ బేసిక్ వెర్షన్ కూడా ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ ఎల్ఈడీ, డిఆర్ఎల్ఎస్ లు, 16-ఇంచ్ స్టీల్ వీల్స్, పవర్ విండోస్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్, వెనుక ఏసీ వెంట్స్, 12V సాకెట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి ఫీచర్స్ ను పొందింది. చివరలో, మీరు లెవల్ 2 ఏడీఏఎస్(ఎడాస్), పనోరమిక్ సన్‌రూఫ్, హర్మాన్ కార్డాన్ మ్యూజిక్ సిస్టమ్, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, అడ్రినో ఎక్స్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ మరియు రియర్ ఏసీ వెంట్‌లతో కూడిన డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్‌లను పొందింది.
డిజైన్ హైలైట్స్
కొత్త XUV 3XO కాస్మెటిక్ అప్‌డేట్‌లలో న్యూ ఫ్రంట్, రియర్ బంపర్స్ మరియు రివైజ్ చేయబడిన ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ టెయిల్‌లైట్స్ ఉన్నాయి. ఇది న్యూ సెట్ అల్లాయ్ వీల్స్‌పై నడుస్తుంది. XUV300 మొత్తం షేప్ మరియు లుక్ మారదు కానీ, మహీంద్రా 3XOకి స్వంతంగా ప్రతేక్యమైన గుర్తింపును అందిస్తుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప