- ఇప్పటికి టెస్టింగ్ చేస్తూ కనిపించిన ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్
- వచ్చే ఏడాది చివర్లో లాంచ్ అవుతున్నదని అంచనా
వెబ్‌లో దీని కొత్త స్పై షాట్‌లు కనిపించడంతో, మహీంద్రా ఎక్స్‌యువి400 ఫేస్‌లిఫ్టెడ్ మునుపటి అప్‌డేట్ కంటే మరింత మోడరన్ రూపంతో రానుందని అర్థం అవుతుంది . ఎక్స్‌యువి300 ఇటీవలి కాలంలో అనేక సందర్భాల్లో పరీక్షించబడినప్పటికీ, ఈ టెస్ట్ మ్యూల్‌లోని బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ ను పరిశీలిస్తే ఈ మోడల్ ఈవీ అని మనకు తెలుస్తుంది మరియు అదే విధంగా ఇది ఇప్పుడు ఎక్స్‌యువి400లో కూడా రానుంది.
మహీంద్రా ఎక్స్‌యువి400 ఫేస్‌లిఫ్ట్ లో భారీగా కప్పబడి ఉండే టెస్ట్ యూనిట్ కొత్త అప్‌డేటెడ్ ను ఫాసియాను పొందడమే కాకుండా, ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ టెస్ట్ కార్లలో కనిపించిన అంశాలను కూడా కలిగి ఉంది. వీటిలో రీవర్క్డ్ హెడ్‌ల్యాంప్ మరియు ఎల్ఈడీ డిఆర్ఎల్ఎస్ సెటప్, రిఫ్రెష్ చేయబడిన ఫ్రంట్ మరియు రియర్ బంపర్‌లు మరియు కొత్త అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. మేము ఇంతకు ముందే చెప్పినట్లుగా, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్ ని చూస్తే, ఇది సబ్-ఫోర్-మీటర్ ఎస్‌యువి ఎలక్ట్రిక్ వెర్షన్ అని మరియు ఐసిఈ వెర్షన్ కాదనే నమ్మకానికి బలాన్ని చేకూరుస్తుంది.
మునుపటి స్పై షాట్‌లు ఎక్స్‌యువి300 ఫేస్‌లిఫ్ట్ యొక్క ఇంటీరియర్‌ను లీక్ చేశాయి మరియు అవే మార్పులు అప్‌డేటెడ్ఎక్స్‌యువి400లో కూడా కొనసాగుతాయని మేము భావిస్తున్నాము. వీటిలో కొత్త, పెద్ద ఫ్రీస్టాండింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సర్దుబాటు చేయగల సెంటర్ కన్సోల్ ఉన్నాయి.
మహీంద్రా ఎక్స్‌యువి400 ప్రస్తుతం రెండు పవర్‌ట్రెయిన్‌లతో అందుబాటులో ఉంది అవి ఏవి అంటే, 34.5kWh బ్యాటరీ ప్యాక్ మరియు 39.4kWh బ్యాటరీ ప్యాక్ – ఇందులోని ఫ్రంట్ వీల్స్ రెండూ ఒకే ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడ్డాయి. అప్‌డేట్ చేసిన వెర్షన్‌లో స్పెసిఫికేషన్స్ కి సంబంధించి ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చని మేము భావిస్తున్నాము. లాంచ్ తర్వాత, ఫేస్‌లిఫ్టెడ్ ఎక్స్‌యువి400 టాటా నెక్సాన్ ఈవీ మరియు ఎంజి జడ్ఎస్ ఈవీలకు పోటీగా ఉండనుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప