హ్యుందాయ్ కంపెనీ ఆరా మోడల్ లోని ఈ(E) వేరియంట్లో హై- సిఎన్‍జిని రూ.7.48 లక్షల ఎక్స్-షోరూం ధరతో తీసుకువచ్చింది. పెరుగుతున్న మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరింత ఎఫిషియన్సీని అందించడానికి ఆరా మోడల్ లో హై- సిఎన్‍జిని లాంచ్ చేసినట్లు హ్యుందాయ్ కంపెనీ పేర్కొంది. మీకో విషయం తెలుసో లేదో ! లేటెస్టుగా హ్యుందాయ్ కంపెనీ దాని అన్ని కార్లలో 6 ఎయిర్ బ్యాగ్స్ ని స్టాండర్డ్ గా తీసుకువచ్చింది.
లాంచ్ అయినప్పటి నుంచి 2 లక్షలకు పైగా అమ్ముడుపోయిన కాంపాక్ట్ సెడాన్ఆరా E, S, SX, SX ప్లస్ మరియు SX (O) అనే 5 వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని డిజైన్ గురించి చెప్పాలంటే, ఈ కారు మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి Z-షేప్డ్ టెయిల్ ల్యాంప్స్ ని కలిగి ఉంది. సేఫ్టీ పరంగా, ఇందులో 6 ఎయిర్ బ్యాగ్స్, 3 పాయింట్ల సీటు బెల్ట్స్ (అన్ని సీట్లకు), సీట్‌బెల్ట్ రిమైండర్ (అన్ని సీట్లకు), మరియు డ్రైవర్ మరియు ప్యాసింజర్లకు సౌకర్యాన్ని అందించేలా అనేక ఇతర సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
హ్యుందాయ్ ఆరా ఈ వేరియంట్ ని1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో కంపెనీ-ఫిట్టెడ్ సిఎన్‍జి కిట్ వెర్షన్ లో పొందవచ్చు. ఈ మోటార్ స్టాండర్డ్‌లో 82bhp మరియు 114Nm టార్క్ మరియు సిఎన్‍జి మోడ్‌లో 68bhp మరియు 95Nm టార్క్ ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది. ట్రాన్స్‌మిషన్ విధులు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ మరియు ఎఎంటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి. హ్యుందాయ్ ఆరా హై- సిఎన్‍జి మోడల్ 28.4 కిమీ/కేజీ మైలేజీని అందిస్తుంది. ప్రస్తుతం సిఎన్‍జితో నడిచే కార్లతో పోలిస్తే, ఇది బెస్ట్ మైలేజీని అందిస్తుంది అని చెప్పవచ్చు.