- ఇండియాలో రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) తో ప్రారంభంకానున్న ధరలు
- పెట్రోలు మరియు డీజిల్ రెండింట్లో లభ్యం
కొన్ని రోజుల క్రితం, కొరియన్ ఆటోమేకర్, హ్యుందాయ్ ఎంతగానో ఎదురుచూసిన క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్ చేసింది. దీనిని ప్రారంభ ధర రూ.11 లక్షల(ఎక్స్-షోరూమ్)తో మీ సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం, కియా సెల్టోస్ కు పోటీగా ఉన్న దీని డెలివరీలు ఇండియాలో మొదలయ్యాయి. ఆసక్తి గల కస్టమర్‌లు 5-సీటర్ ఎస్‌యువిని ఈ బ్రాండ్ యొక్క (అంటే హ్యుందాయ్) ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా లేదా వారి సమీపంలో ఉన్న అధికారిక షోరూమ్‌ని సంప్రదించి రూ.25,000 టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు.
హ్యుందాయ్ 2024 క్రెటాను 7 ఎక్స్‌టీరియర్పెయింట్ షేడ్స్‌లో 7 వేరియంట్‌లలో పొందవచ్చు. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మరియు ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఎస్‌యువి 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ మొబైల్ కనెక్టివిటీతో 10.25-ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరా, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియులెవల్ 2 ఏడీఏఎస్ సేఫ్టీ సూట్‌ని కలిగి ఉంది.
ఈ కొత్త క్రెటా మూడు పవర్‌ట్రెయిన్‌లలో అందించబడుతుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఇందులో ట్రాన్స్‌మిషన్ విధులను 6-స్పీడ్ మాన్యువల్, 6 -స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డిసిటి మరియు సివిటి యూనిట్ ద్వారా నిర్వహించబడతాయి, అలాగే ఈ మోడల్ ఏఆర్ఏఐ- సర్టిఫైడ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ 21.8కెఎంపిఎల్ మైలేజ్ ని అందిస్తుంది.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ ఇండియన్ మార్కెట్లో, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూజర్ హైరైడర్, ఫోక్స్‌వ్యాగన్ టైగన్ మరియు స్కోడా కుషాక్ వంటి వాటితో పోటీపడుతుంది.
అనువాదించిన వారు: రాజపుష్ప