- ఈ నెల ప్రారంభంలో పెరిగిన ఆరా ధరలు
- అందుబాటులో ఉన్న పెట్రోల్ మరియు సిఎన్‍జి పవర్‌ట్రెయిన్ ఆప్షన్స్
ప్రస్తుత కాలంలో భారత దేశమంతటా విక్రయించబడుతున్న వివిధ కార్లపై వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది. మేము ఆల్కాజార్, ఎక్స్‌టర్, వెన్యూ, గ్రాండ్ ఐ10 నియోస్ మరియు వెర్నా వంటి కొన్ని మోడళ్లకు సంబంధించిన టైమ్‌లైన్‌ల గురించి వెబ్ సైట్ లో ఇంతకు ముందే వివరించాము. ఇప్పుడు మనం ఆరాపై ఉన్న వెయిటింగ్ పీరియడ్ గూర్చి పరిశీలిద్దాం.
అక్టోబర్ 2023లో, హ్యుందాయ్ ఆరాపై అత్యధికంగా 30 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, ఇది E పెట్రోల్ వేరియంట్ పై వర్తిస్తుంది. దాని తర్వాత SX(O) పెట్రోల్ వేరియంట్ పై 26 వారాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఇంకా పెట్రోల్ రేంజ్ లోని అన్ని వేరియంట్స్ పై 18 వారాల వరకువెయిటింగ్ పీరియడ్ ఉండనుంది.
మరోవైపు, ఆరాలోని సిఎన్‍జి ఇటరేషన్ పై వెయిటింగ్ పీరియడ్ 6 నుండి 8 వారాల వరకు ఉంటుంది. ఇతర వార్తలలో చూస్తే, హ్యుందాయ్ ఆరా రేంజ్ ధరలను రూ.11,200 వరకు పెంచింది. అదే సమయంలో, మారుతి డిజైర్ వంటి వాటికి పోటీగా ఉన్న ఈ సబ్-ఫోర్ మీటర్ల సెడాన్ పై రూ.33,000 వరకు డిస్కౌంట్స్ లభించనున్నాయి.
అనువాదించిన వారు: రాజపుష్ప