- పెట్రోల్ వెర్షన్లపై మాత్రమే ప్లాన్ వర్తింపు
- కారును విక్రయించినా కూడా వారంటీని బదిలీ చేసే అవకాశం
హోండా కార్స్ ఇండియా సెలెక్టెడ్ వెర్షన్లలో కొత్తగా పొడిగించిన (ఎక్స్ టెండెడ్) వారంటీ ప్రోగ్రామ్‌ను పరిచయం చేసింది. ప్రోగ్రామ్‌లో భాగంగా, కస్టమర్లు తమ వారంటీని కొనుగోలు చేసిన తేదీ నుండి ఏడు సంవత్సరాల వరకు వారంటీని పొడిగించవచ్చు. అదనంగా ఇంకో విషయం ఏంటి అంటే, పైనపేర్కొన్న పీరియడ్ లో మీరు ప్రయాణించే కిలోమీటర్లపై లిమిట్ లేదు. అన్ లిమిటెడ్ గా మీరు ప్రయాణించవచ్చు.
ఈ పొడిగించిన (ఎక్స్ టెండెడ్) వారంటీని హోండా కంపెనీ దాని ప్రస్తుత మోడల్ రేంజ్ లో ఉన్న పెట్రోల్ వెర్షన్‌లపై అందిస్తుంది, ఇందులో ఎలివేట్, సిటీ, సిటీ e:HEV మరియు అమేజ్ వంటి కార్లు ఉన్నాయి. ఈ ప్లాన్ సివిక్, జాజ్ మరియు WR-V వంటి ఇతర మోడళ్ల పెట్రోల్ వెర్షన్‌లను కూడా కవర్ చేస్తుంది. కస్టమర్ ఇంతకు ముందే పొడిగించిన (ఎక్స్ టెండెడ్) వారంటీ ప్రోగ్రామ్ కోసం రిజిస్టర్ చేసుకున్నట్లయితే ఈ ప్యాకేజీ వర్తిస్తుంది.
హోండా పొడిగించిన (ఎక్స్ టెండెడ్) వారంటీ ప్రోగ్రామ్‌లో భాగంగా అన్ లిమిటెడ్ కిలోమీటర్ పాలసీ, ఏడు సంవత్సరాల కవరేజ్, దేశవ్యాప్తంగా సర్వీస్ నెట్‌వర్క్ మరియు పేర్కొన్న పీరియడ్ లో వాహనాన్ని విక్రయించేటప్పుడు వారంటీని బదిలీ చేయడం వంటి ముఖ్యాంశాలు ఇందులో ఉన్నట్లు హోండా కంపెనీ పేర్కొంది.
ఇతర వార్తలలో చూస్తే, హోండా కంపెనీ గత నెలలో దేశవ్యాప్తంగా ఎలివేట్ అపెక్స్ ఎడిషన్‌ను లాంచ్ చేయగా, దీని ధరలు రూ. 12.68 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యాయి. మేము స్టాండర్డ్ కారుతో పోలిస్తే ఈ ఎడిషన్ ద్వారా అందించిన మార్పుల వివరాలను మా వెబ్ సైటులో అందించాము. మీరు మా వెబ్‌సైట్‌ని సందర్శించి, దీని గురించి పూర్తిగా చదువుకోవచ్చు.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్