- ఇండియాలో రూ. 11.91 లక్షలతో (ఎక్స్-షోరూం) ధరలు ప్రారంభం
- ఇప్పుడు 3-పాయింట్ సీట్‌బెల్ట్స్, 6 ఎయిర్‌బ్యాగ్స్ మరియు సీట్‌బెల్ట్ రిమైండర్‌లను స్టాండర్డ్ గా పొందిన ఎలివేట్
కొత్త ఆర్ధిక సంవత్సరంలో భాగంగా, ఇండియన్ ఆటోమేకర్స్ పోర్ట్ ఫోలియోలో ఉన్న అన్ని మోడల్స్ ధరలను పెంచుతున్నాయి. దీంతో, అదే లైన్ లో ఇప్పుడు జపనీస్ ఆటోమేకర్ హోండా కూడా దాని మోడల్స్ ధరలను పెంచింది, అందులో హోండా నుంచి వచ్చిన ఎలివేట్ కూడా ఉంది. మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్స్ లో నాలుగు వేరియంట్లలో అందించబడుతూ హ్యుందాయ్ క్రెటాకి పోటీగా ఉన్న ఈ మోడల్ పై సుమారు రూ.44,100 వరకు ధర పెరిగింది. దీంతో ఈ కారు ఇప్పుడు మరింత ప్రియంకానుంది.
బానెట్ కింద, ఎలివేట్ 1.5-లీటర్ ఐ-విటెక్ గ్యాసోలిన్ ఇంజిన్ తో రాగా, ఇది 119bhp పవర్ మరియు 145Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కస్టమర్లు దీనిని 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ లేదా సివిటి యూనిట్ తో కాన్ఫిగర్ చేసి పొందవచ్చు. ముఖ్యంగా, చెప్పాల్సిన అంశం ఏంటి అంటే, ఎలివేట్ ఎంటి వేరియంట్ 15.31కెఎంపిఎల్ ఫ్యూయల్ ఎఫిషియన్సీని అందిస్తుందని, అలాగే సివిటి 16.92కెఎంపిఎల్ మైలేజీని అందిస్తుందని ఆటోమేకర్ పేర్కొన్నది.
వేరియంట్ వారీగా ఎలివేట్ ఎక్స్-షోరూం ధరలు కింద ఇవ్వబడ్డాయి:
వేరియంట్లు | పాత ధర | కొత్త ధర | ధర పెరుగుదల |
SV ఎంటి | రూ. 11,57,900 | రూ. 11,91,000 | రూ. 33,100 |
V ఎంటి | రూ. 12,30,900 | రూ. 12,71,000 | రూ. 44,100 |
V సివిటి | రూ. 13,40,900 | రూ. 13,71,000 | రూ. 30,100 |
VX ఎంటి | రూ. 13,69,900 | రూ. 14,10,000 | రూ. 40,100 |
VX సివిటి | రూ. 14,79,900 | రూ. 15,10,000 | రూ. 30,100 |
ZX ఎంటి | రూ. 15,09,900 | రూ. 15,41,000 | రూ. 31,100 |
ZX సివిటి | రూ. 16,19,900 | రూ. 16,43,000 | రూ. 23,100 |
అనువాదించిన వారు: సంజయ్ కుమార్