- అందుబాటులో ఉన్న 4 వేరియంట్స్
- ఇండియాలో ప్రారంభ ధర రూ. 11 లక్షలు
హోండా కార్స్ ఇండియా తమ ప్రతిష్టాత్మక ఉత్పత్తిలో భాగంగా అత్యధికంగా ఎలివేట్ ఎస్‌యువిని ఈ ఏడాది సెప్టెంబర్‌లో దేశం అంతటా విడుదల చేసింది. పెట్రోల్ తో మాత్రమే నడిచే ఎస్‌యువిని రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో 4 వేరియంట్స్ లో పొందవచ్చు. మిడ్-సైజ్ క్రెటాకు ప్రత్యర్థిగా ఉన్న ఇందులో ఏడీఏఎస్, బ్లైండ్ స్పాట్ మానిటర్, సన్‌రూఫ్ మరియు వైర్‌లెస్ ఛార్జర్ వంటి ఫీచర్లను కలిగి ఉంది, కాకపోతే ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందిన వెంటిలేటెడ్ సీట్ల ఫీచర్ ఇందులో అందుబాటులో లేదు.
జపనీస్ కార్‌మేకర్ దీనికి ఉన్న అధిక డిమాండ్‌ను గుర్తించి ఇప్పుడు మసాజ్ ఫంక్షన్‌తో వెంటిలేటెడ్ సీట్లను అందిస్తోంది. అయితే, ఎలివేట్ ఎస్‌యువిలో అదనంగా కేవలం రూ. రూ. 6,000తో ఒక యాక్సెసరీగా మాత్రమే అందుబాటులో ఉంది. ఇది 12V ఛార్జింగ్ సాకెట్ కు కనెక్ట్ చేయడానికి స్ట్రాప్-ఆన్ సీట్ కవర్‌తో వస్తుంది.
మరోవైపు చూస్తే , కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు జర్మన్ స్కోడా కుషాక్ మరియు ఫోక్స్‌వ్యాగన్ టైగున్ లకు పోటీగా స్టాండర్డ్ బిల్ట్-ఇన్ సీట్ వెంటిలేషన్ ఫంక్షన్‌ను ఇది కలిగి ఉంది.
మెకానికల్‍గా, ఎలివేట్ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు సివిటి యూనిట్‌తో జత చేయబడింది. ఈ మోటార్ హోండా సిటీ మాదిరిగా 119bhp మరియు 145Nm మాక్సిమమ్ టార్క్‌ని ఉత్పత్తి చేయడానికి ట్యూన్ చేయబడింది.
అనువాదించిన వారు: రాజపుష్ప