- ఇండియాలో రూ.11.58 లక్షలతో ఎలివేట్ ధరలు ప్రారంభం
- 4 వేరియంట్లు మరియు 10 కలర్లలో లభ్యం
దేశవ్యాప్తంగా ఉన్న సెలెక్టెడ్ హోండా కార్ డీలర్ షిప్స్ మార్చి నెలలో తమ మోడల్ రేంజ్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నాయి. ఈ బెనిఫిట్స్ క్యాష్ డిస్కౌంట్స్, ఎక్స్చేంజ్ బోనస్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ల రూపంలో కస్టమర్లు పొందవచ్చు.
లాంచ్ అయినప్పటి నుండి మొదటిసారిగా, హోండా మిడ్-సైజ్ ఎస్యూవీ ఎలివేట్ పై భారీ డిస్కౌంట్లను అందిస్తుంది. మార్చి-2024లో ఈ మోడల్ ని కొనుగోలు చేస్తున్న కస్టమర్లు రూ. 50,000 క్యాష్ డిస్కౌంట్ పొందవచ్చు. ఈ బెనిఫిట్ ఎంచుకున్న వేరియంట్, కలర్, లొకేషన్ మరియు మరిన్ని అంశాలపై ఆధారపడి మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం హోండా ఎలివేట్ యొక్క 1.5-లీటర్ ఐ-విటెక్ పెట్రోల్ ఇంజిన్ 6-స్పీడ్ మాన్యువల్ యూనిట్ లేదా సివిటి యూనిట్ తో జతచేయబడి వచ్చింది. ఈ మోడల్ ని 4 వేరియంట్లలో మరియు 10 కలర్లలో బుక్ చేసుకునే వీలుంది. ఇతర వార్తలలో చూస్తే, జనవరిలో రూ.58,000 వరకు హోండా ఎలివేట్ పై ధరలు పెరిగాయి.
అనువాదించిన వారు: సంజయ్ కుమార్